Wednesday, October 19, 2016

జగన్మోహిని కథ – కాము గెలువవచ్చుఁ

8-404-క.
దాత్మకుఁడగు శంభుఁడు
గిడెను హరి నెఱిఁగి తనదు మాహాత్మ్యమునన్
వితత్రపుఁడై నిలిచెను
గువతనం బుడిగి హరియు గవాఁ డయ్యెన్.
8-405-ఆ.
కాము గెలువవచ్చుఁ గాలారి గావచ్చు
మృత్యుజయముఁ గలిగి మెఱయవచ్చు
నాఁడువారి చూపుటంపఱ గెలువంగ
శము గాదు త్రిపురవైరి కైన.
8-406-వ.
ఇట్లు పురుషాకారంబు వహించిన హరి హరున కిట్లనియె.

టీకా:
            జగత్ = భువనములే; ఆత్మకుడు = తానైనవాడు; అగు = అయిన; శంభుడు = శంకరుడు; మగిడెను = వెనుదిరిగెను; హరిన్ = విష్ణుమూర్తిని; ఎఱిగి = తెలిసికొని; తనదు = తన యొక్క; మహాత్మ్యమునన్ = గొప్పదనమువలన; విగత = పోయిన; త్రపుడు = లజ్జలనువిడిచినవాడు; ఐ = అయ్యి; నిలిచెను = నిలబడెను; మగువతనంబున్ = స్త్రీరూపమును; ఉడిగి = విడిచి; హరియున్ = విష్ణువుకూడ; మగలాడు = పురుషుడు; అయ్యెన్ = అయ్యెను.
            కామున్ = మన్మథుని; గెలువవచ్చున్ = జయించవచ్చును; కాలున్ = యముని; అరిన్ = ధిక్కరించినవాడు; కావచ్చున్ = అవ్వవచ్చును; మృత్యు = మరణముపై; జయము = గెలుపు; కలిగి = సాధించి; మెఱయవచ్చున్ = ప్రకాశించవచ్చును; ఆడువారి = స్త్రీల; చూపుల = చూపులనడి; అంపఱన్ = బాణములను; గెలువంగన్ = జయించుట; వశము = సాధ్యము; కాదు = కాదు; త్రిపురవైరి = పరమశివుని; కైనన్ = అయినప్పటికిని.
            ఇట్లు = ఈ విధముగ; పురుషాకారంబున్ = పురుషరూపము; వహించిన = ధరించినట్టి; హరి = విష్ణువు; హరున్ = శంకరుని; కిన్ = కి; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:
          భువన స్వరూపుడు అయిన శివుడు తన మహిమాతిశయంవల్ల విష్ణు మాయను తెలుసుకుని, వెనుతిరిగాడు. విష్ణువు సిగ్గుతోపాటు, స్త్రీ రూపాన్ని విడిచిపెట్టి మగవాడిగా మారిపోయాడు.
          మన్మథుడిని ఓడించి కామాన్ని జయించవచ్చు. యముని ధిక్కరించి, మృత్యుంజయుడై ప్రకాశించవచ్చు. కానీ, ఆడవారి వాలుచూపుల వాడిబాణాలను గెలవడం త్రిపురాంతకుడైన ఆ మహాశివుడికైనా సాధ్యంకాదు.
          అంత మోహినీరూపాన్ని చాలించిన విష్ణువు శివునితో ఇలా అన్నాడు. . .

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: