Monday, October 24, 2016

వామన వైభవము - దండిత


బలియుద్ధయాత్ర 

8-443-క.
దండిత మృత్యు కృతాంతులు
ఖండిత సుర సిద్ధ సాధ్య గంధర్వాదుల్
పిండిత దిశు లమరాహిత
దండాధీశ్వరులు సములు న్నుం గొలువన్.
8-444-క.
చూపుల గగనము మ్రింగుచు
నేపున దివి భువియు నాత లీతల చేయన్
రూపించుచు దనుజేంద్రుఁడు 
ప్రాపించెను దివిజనగర థము నరేంద్రా!
టీకా:
          దండిత = దండింపబడిన; మృత్యు = మృత్యుదేవత; కృతాంతులున్ = యమధర్మరాజుగలవారు; ఖండిత = ఓడింపబడిన; సుర = దేవతలు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; గంధర్వ = గంధర్వులు; ఆదుల్ = మున్నగువారు; పిండిత = పీడింపబడిన; దిశులు = దిక్కులుగలవారు; అమరాహిత = రాక్షస; దండాధీశ్వరులున్ = సేనానాయకులు; సములున్ = సమబలులు; తన్నున్ = తనను; కొలువన్ = సేవించుచుండగా.
          చూపులన్ = చూపులతో; గగనమున్ = ఆకశమును; మ్రింగుచున్ = కబళించుచు; ఏపునన్ = అతిశయముతో; దివిన్ = నింగిని; భువియున్ = నేలను; ఆతలలీతలన్ = తలకిందులు; చేయన్ = చేయవలెనని; రూపించుచున్ = యత్నించుచు; దనుజేంద్రుడు = బలిచక్రవర్తి; ప్రాపించెను = పట్టెను; దివిజనగర = అమరావతి; పథమున్ = దారిని; నరేంద్రా = రాజా.
భావము:
            బలిచక్రవర్తి తో సమానమైన బలముగల దైత్యసేనాపతులు ఆయన ముందు వినమ్రులై నిలిచి కొలువసాగారు. వారు మృత్యు దేవతనూ, యమధర్మరాజునూ దండింప గల ఉద్దండులు. దేవతలూ, సిద్ధులూ, సాధ్యులూ, గంధర్వులూ మొదలైనవారిని భంగపరిచిన వారు. దిక్కులను ముక్కలు చేయగలవారు.
            పరీక్షన్మహారాజా! బలిచక్రవర్తి అతిశయించిన బలంతో తన చూపులతో ఆకాశాన్ని కబళిస్తూ, నింగినీ నేలనూ తలకిందులు చేయాలని పొంగిపడుతూ దేవతల రాజధాని అమరావతి పట్టణం దారి పట్టాడు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: