8-400-మ.
రుచిరాపాంగిని వస్త్రబంధనపరన్ రోమాంచ విభ్రాజితం
గుచభారానమితం గరద్వయపుటీ గూఢీకృతాంగిం జల
త్కచ బంధం గని మన్మథాతురత నాకంపించి శంభుండు ల
జ్జ చలింపం దనకాంత
చూడఁ గదిసెం జంద్రాస్య కేల్దమ్మికిన్.
8-401-ఆ.
పదము చేరవచ్చు ఫాలక్షుఁ బొడగని
చీర వీడిపడిన సిగ్గుతోడ
మగువ నగుచుఁ దరుల మాటున డాఁగెను
వేల్పుఱేఁడు నబల వెంటఁ బడియె.
టీకా:
రుచిరాపాంగిని
= అందగత్తె;
వస్త్ర = బట్టను;
బంధన = కట్టుకొనుటయందు;
పరన్ = నిమగ్నమైన యామెను;
రోమాంచన్ = మైపులకరింపుగలామె;
విభ్రాజితన్ = శృంగారరూపిని;
కుచ = స్తనముల యొక్క;
భార = బరువులచేత;
అనమితన్ = వంగినామె;
కర = చేతుల;
ద్వయ = రెండు (2);
పుటీ =
దొప్పలతోను;
గూఢీకృత = దాచుకొన్న;
అంగిన్ = స్తనములుగలామెను;
చలత్ = చలించిన;
కచబంధన్ = కొప్పుముడిగలామెను;
కని = చూసి;
మన్మథ = కామ;
ఆతురతన్ = ఆవేశముచేత;
ఆకంపించి = చలించిపోయి;
శంభుండు = పరమశివుడు;
లజ్జన్ = సిగ్గుతో;
చలింపన్ =
చలించిపోవునట్లు;
తన = తన యొక్క;
కాంత = భార్య;
చూడన్ = చూచుచుండగ;
కదిసెన్ =
చేరెను; చంద్రాస్య = సుందరిని;
కేలు = చేయి యనెడి;
తమ్మి = పద్మమున;
కిన్ = కు.
పదమున్ = దగ్గరకు;
చేరన్ = చేరుటకై;
వచ్చు = వస్తున్న;
ఫాలాక్షున్ = శంకరుని;
పొడగని = కాంచి;
చీర = బట్ట; వీడి = జారి;
పడిన = పడిపోయిన;
సిగ్గు = సిగ్గు;
తోడన్ = తోటి;
మగువ =
స్త్రీ; నగుచున్ = నవ్వుతూ;
తరుల = చెట్ల;
మాటునన్ = చాటునకు;
డాగెను =
దాగుకొనెను;
వేల్పుఱేడున్ = శంకరుడు;
వెంటబడియె = వెనుతగిలెను.
భావము:
కడగంటి
కాంతులు తళుక్కుమని మెరస్తున్న మోహిని, చీర సరిగా కట్టుకోడానికి ప్రయత్నించింది.
ఆమె మేను పులకించింది. స్తనభారంతో ఆమె వంగింది. రెండు చేతులతో ఆమె వక్షః స్ధలాన్ని
కప్పుకున్నది. ఆమె కొప్పుముడి వీడి వ్రేలాడుతున్నది. ఆ స్ధితిలో ఆమెను చూసి
కామావేశంతో శివుడు చలించి పోయాడు. అతడు సిగ్గు పడేటట్లు సతీదేవి చూస్తున్నది.
అయినా ఆయన చంద్రుని వంటి మోము గల ఆ మోహిని చేయి పట్టుకోడానికి వెళ్ళాడు.
మోహిని
సమీపిస్తున్న శివుని అడుగు దూరంలో చూసింది. చీర ఊడిన సిగ్గుతో నవ్వుతూ చెట్ల చాటున
దాగింది. ముక్కంటి ఆ వాల్కంటి వెంటబడ్డాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment