8-462-వ.
ఆ
మహాత్ముం డిట్లనియె.
8-463-మ.
తెఱవా! విప్రులు పూర్ణులే? చెలగునే దేవార్చనాచారముల్?
తఱితో వేలుతురే గృహస్థులు? సుతుల్ ధర్మానుసంధానులే?
నెఱి నభ్యాగత కోటి కన్న మిడుదే? నీరంబునుం బోయుదే?
మఱ లే కర్థుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే?
పైదలీ!
టీకా:
ఆ = ఆ; మహాత్ముండు =
గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ;
అనియె = పలికెను.
తెఱవా = సుందరీ
{తెఱవ - తెఱ (స్వచ్చమైన) వ(ఆమె),
స్త్రీ}; విప్రులు = బ్రాహ్మణులు;
పూర్ణులే =
సంతృప్తులేనా;
చెలగునే = చక్కగానున్నవా;
దేవ = దేవతలు;
ఆర్చన = పూజలు;
ఆచారముల్ = ఆచారములు; తఱి = సమయపాలన;
తోన్ = తోటి;
వేలుతురే = హోమములుచేస్తున్నారా;
గృహస్థులు = ఇంటిలోనివారు;
సుతుల్ = కొడుకులు;
ధర్మ = ధర్మమును;
అనుసంధానులే =
పాటిస్తున్నారా;
నెఱిన్ = పద్దతిప్రకారముగ;
అభ్యాగత = అతిథులకు;
కోటి = అందరకు;
అన్నము = భోజనము;
ఇడుదే = పెట్టుచున్నావా;
నీరంబునున్ = మంచినీరుకూడ;
పోయుదే =
ఇస్తున్నావా;
మఱ = మరపు; లేక = లేకుండగ;
అర్థులన్ = యాచకులను;
దాసులను =
సేవకులను; సుజనులన్ = సజ్జనులను;
మన్నింపుదే = సమ్మానించుచున్నావా;
పైదలీ =
చిన్నదానా.
భావము:
కశ్యపుడు తన ఇల్లాలు అదితితో ఇంకా ఇలా అన్నాడు.
“చిన్నదానా! స్వచ్ఛమైనదానవు నీవు. ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు. బ్రాహ్మణులను ఏ లోటూ
లేకుండా ఆదరిస్తున్నావు కదా! దేవాలయాలలో పూజలు
సమయానుగుణంగా సాగుతున్నాయా? మన వారు అందరూ ఇక్కడ వేళకు సరిగా హోమకార్యాలు నెరవేరుస్తున్నారా? నీ కొడుకులు ధర్మాన్ని పాటిస్తున్నారా? అతిధులకు అన్న పానాలు ఇచ్చి ఆదరిస్తున్నావు కదా! మర్చిపోకుండా బిచ్చగాళ్లకు, సేవకులకూ, సజ్జనులకు సత్కారాలు
చేస్తున్నావు కదా!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment