Sunday, October 23, 2016

వామన వైభవం - పాణియు


బలియుద్ధయాత్ర 

8-440-వ.
ఇవ్విధంబున
8-441-క.
పాణియు, రథియుఁ, గృపాణియుఁ
దూణియు, ధన్వియును, స్రగ్వి తురగియు, దేహ
త్రాణియు, ధిక్కృత విమత
ప్రాణియు, మణి కనక వలయ పాణియు నగుచున్.
8-442-మ.
లుదానంబుల విప్రులం దనిపి తద్భద్రోక్తులం బొంది పె
ద్దకున్ మ్రొక్కి విశిష్టదేవతల నంర్భక్తిఁ బూజించి ని
ర్మలుఁ బ్రహ్లాదునిఁ జీరి నమ్రశిరుఁడై రాజద్రథారూఢుఁడై
వెలిఁగెన్ దానవ భర్త శైల శిఖ రోద్వేల్ల ద్దవాగ్ని ప్రభన్.
టీకా:
          ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
          పాణియున్ = బాణములుచేతగలవాడు; రథియున్ = రథమెక్కినవాడు; కృపాణియున్ = కత్తిధరించినవాడు; తూణియున్ = అమ్ములపొదిగలవాడు; ధన్వియును = విల్లుధరించినవాడు; స్రగ్వి = పూలదండగలవాడు; తురగియున్ = గుర్రముగలవాడు; దేహత్రాణియున్ = కవచధారి; ధికృత = తిరస్కరింపబడిన; విమత = శత్రువుల; ప్రాణియున్ = ప్రాణములుగలవాడు; మణి = రత్నాల; కనక = బంగారపు; వలయ = కంకణములుగల; పాణియున్ = చేతధరించినవాడు; అగుచున్ = అగుచు.
          పలు = అనేకమైన; దానంబులన్ = దానములతో; విప్రులన్ = బ్రాహ్మణులను; తనిపి = సంతృప్తిపరచి; తత్ = వారి; భద్రోక్తులన్ = ఆశీర్వచనములను; పొంది = పొంది; పెద్దల్ = పెద్దల; కున్ = కు; మ్రొక్కి = నమస్కరించి; విశిష్టదేవతలన్ = ఇలవేల్పును; అంతర్ = ఏకాంత; భక్తిన్ = భక్తితో; పూజించి = పూజలుచేసి; నిర్మలున్ = నిర్మలచరిత్రుని; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; చీరి = పిలిచి; నమ్ర = వంచిన; శిరుడు = తలగలవాడు; ఐ = అయ్యి; రాజత్ = మెరిసిపోతున్న; రథ = రథముపై; ఆరూఢుడు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; వెలిగెన్ = ప్రకాశించెను; దానవభర్త = రాక్షసరాజు; శైల = కొండ; శిఖర = కొనపై; ఉద్వత్ = మండుచున్న; దవాగ్ని = కార్చిచ్చు; ప్రభన్ = ప్రకాశముతో.
భావము:
            ఈవిధంగా...
            బలిచక్రవర్తి బాణాలూ, రధమూ, ఖడ్గమూ, అమ్ములపొదులూ, విల్లు, పూలదండ, గుర్రాలు, కవచమూ, రత్నఖచిత సువర్ణకంకణాలు సంపాదించాడు. అటుపిమ్మట పగవారిపై పగతీర్చుకొవాలి అని నిశ్చయించుకున్నాడు.
            గొప్పదానాలతో బలిచక్రవర్తి బ్రాహ్మణులను సంతోషపెట్టి వారి దీవనలు అందుకున్నాడు. పెద్దలను పూజించాడు. నిండుభక్తితో ఇలవేల్పులను పూజించాడు. నిర్మలచరిత్రుడైన ప్రహ్లాదుడిని ఆహ్వానించి ప్రణమిల్లాడు. నిగనిగలాడే రథంపై కూర్చుని కొండశిఖరాన ప్రచండంగా మండే కార్చిచ్చు వలె ప్రకాశించసాగాడు.

No comments: