Saturday, October 8, 2016

హరిహరసల్లాపాది - భావించి కొందఱు

8-386-సీ.
భావించి కొందఱు బ్రహ్మంబు నీ వని
లపోసి కొందఱు ర్మ మనియుఁ
ర్చించి కొందఱు దసదీశ్వరుఁడని
రవిఁ గొందఱు శక్తి హితుఁ డనియుఁ
జింతించి కొందఱు చిరతరుం డవ్యయుఁ
డాత్మతంత్రుఁడు పరుం ధికుఁ డనియు
దొడరి యూహింతురు తుది నద్వయద్వయ
దసద్విశిష్ట సంశ్రయుఁడ వీవు;
8-386.1-తే.
లఁప నొక్కింత వస్తుభేదంబుఁ గలదె
కంకణాదులు బసిఁడి యొక్కటియ కాదె
డలు పెక్కైన వార్థి యొక్కటియ కాదె
భేద మంచును నిను వికల్పింప వలదు.
టీకా:
            భావించి = అనుకొని; కొందఱు = కొంతమంది; బ్రహ్మంబున్ = పరబ్రహ్మమవు; నీవు = నీవే; అని = అని; తలపోసి = అనుకొని; కొందఱు = కొంతమంది; ధర్మము = ధర్మస్వరూపమవు; అనియున్ = అని; చర్చించి = అనుకొని; కొందఱు = కొంతమంది; సత్ = సద్రూప; అసత్ = అసద్రూప; ఈశ్వరుండు = ప్రభువవు; అని = అని; సరవిన్ = క్రమముగా; కొందఱు = కొంతమంది; శక్తి = శక్తితో; సహితుడు = కూడినవాడవు; అనియున్ = అని; చింతించి = అనుకొని; కొందఱు = కొంతమంది; చిరతరుండు = శాశ్వతుడు; అవ్యయుడు = నాశరహితుడు; ఆత్మతంత్రుడు = సర్వస్వతంత్రుడు; పరుండు = సర్వాతీతమైనవాడు; అధికుడు = గొప్పవాడవు; అనియున్ = అని; తొడరి = అతిశయించి; ఊహింతురు = అనుకొనెదరు; తుదిన్ = చివరకు; అద్వయ = అద్వితీయమైన; ద్వయ = సర్వాతీతమైన; సత్ = సత్తు; అసత్ = అసత్తుల; విశిష్ట్ = శ్రేష్ఠమైన; సంశ్రయుడవు = నిలయమైనవాడవు; ఈవు = నీవు. 
            తలపన్ = తరచిచూసిన; ఒక్కింత = కొంచమైన; వస్తు = వాస్తవమైన; భేదంబున్ = భేదము; కలదె = ఉన్నదా లేదు; కంకణ = కంకణములు; ఆదులు = మొదలగునవి; పసిడిన్ = బంగారము; ఒక్కటియన్ = ఒక్కటే; కాదె = కదా; కడలు = అలలు; పెక్కు = అనేకము; ఐనన్ = అయియున్నను; వార్థి = సముద్రము; ఒక్కటియ = ఒక్కటే; కాదె = కదా; భేదము = భేదము; అంచును = అంటూ; నినున్ = నిన్ను; వికల్పింపన్ = భ్రాంతి; వలదు = వద్దు.
భావము:
            నీవు పరబ్రహ్మ వని కొందరు భావిస్తారు. నీవు ధర్మ మని కొందరు తలుస్తారు. నీవు ప్రకృతి పురుషుల కంటె పరుడ వని కొంద రంటారు. నీవు శక్తిరూపుడ వని కొందరు ధ్యానిస్తారు. విష్ణువుగా, శాశ్వతుడుగా, స్వతంత్రుడుగా, పరమపురుషుడుగా, ఉత్తముడుగా కొందరు నిన్ను ఊహిస్తారు. అన్నింటినీ మించి సాటిలేనివాడవు నీవు. సదసత్తులకు పవిత్రమైన నిలయం నీవు. ఆలోచించి చూస్తే కంకణం మొదలైన బంగారు నగలూ బంగారమూ వాస్తవంగా ఒకటే కదా. అనంతమైన అలలూ సముద్రమూ ఒకటేకదా. అలాగే, పైకి భేధం కనిపిస్తున్నా నీకు ఈ సృష్టికి వాస్తవంగా భేదం ఉంది అని భావించే పని లేనేలేదు.

No comments: