8-402-మ.
ప్రబలోద్యత్కరిణిం గరీంద్రుఁడు రమింపన్ వచ్చు లీలన్ శివుం
డబలా పోకుము పోకుమీ యనుచు డాయం బాఱి కెంగేలఁ ద
త్కబరీ బంధము పట్టి సంభ్రమముతోఁ గౌగిళ్ళ నోలార్చె నం
త బహిః
ప్రక్రియ నెట్టకేనిఁ గదియం దద్బాహునిర్ముక్త యై.
టీకా:
ప్రబల = మిక్కలి;
ఉత్ = ఈడేరిన;
కరిణిన్ = ఆడ ఏనుగును;
కరి = గజ; ఇంద్రుడు = రాజు;
రమింపన్ =
క్రీడించుటకు;
వచ్చు = చేరవచ్చెడి;
లీలన్ = విధముగా;
శివుండు = శంకరుడు;
అబలా =
సుందరీ; పోకుము = పోవద్దు;
పోకుమీ = పోవద్దు;
అనుచున్ = అంటూ;
డాయం = దగ్గరకు;
పాఱి = పరిగెట్టి;
కెంగేలన్ = ఎర్రని అరచేతితో;
తత్ = ఆమె; కబరీబంధమున్ = జడను;
పట్టి = పట్టుకొని;
సంభ్రమము = పరవశత్వము;
తోన్ = తోటి;
కౌగిళ్ళన్ = కౌగిట్లో;
ఒలార్చెన్ = ముంచివేసెను;
అంతన్ = అంతట;
బహిః = బయటపడెడి;
ప్రక్రియన్ =
ప్రయత్నముతో;
ఎట్టకేని = చిట్టచివరకు;
కదియన్ = పట్టుకొన్న;
తత్ = అతని;
బాహు =
చేతులనుండి;
నిర్ముక్త = విడిపించుకొన్నామె;
ఐ = అయ్యి.
భావము:
బాగా
ఈడేరిన ఆడఏనుగుతో క్రీడించటానికి వెన్నాడిన మదించిన మగ ఏనుగు వలె, పరమేశ్వరుడు పరుగెత్తి మోహినిని సమీపించాడు. అబలా “పోవద్దు పోవద్దు” అంటూ
ఆమె జడ పట్టుకున్నాడు. వేగిరపాటుతో కౌగిలించుకున్నాడు. పరవశత్వంతో రతిక్రీడకు
పూనుకోబోగా, ఆమె అతని పట్టు వదిలించుకుంది.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment