8-468-వ.
అని
పలికినం బతికి సతి యి ట్లనియె.
పలికెను.
8-469-ఉ.
ప్రేమ యొకింత లేక దితి బిడ్డలు బిడ్డలబిడ్డలున్ మహా
భీమ బలాఢ్యులై తనదుబిడ్డల నందఱఁ దోలి సాహసా
క్రామిత వైరులయ్యు నమరావతి నేలుచు నున్నవారు; నీ
కే మని
విన్నవింతు? హృదయేశ్వర! మేలుఁ దలంచి చూడవే?
టీకా:
అని = అని; పలికిన =
అడిగిన; పతి = భర్త;
కిన్ = కి; సతి = భార్య;
ఇట్లు = ఇలా;
అనియె = పలికెను
ప్రేమ =
ప్రేమాభిమానములు;
ఒకింత = కొంచముకూడ;
లేక = లేకుండగ;
దితి = దితి యొక్క;
బిడ్డలు = పిల్లలు; బిడ్డలబిడ్డలు = మునుమలు;
మహా = అధికమైన;
భీమ = భీకరమైన;
బలాఢ్యులు =
శక్తిమంతులు;
ఐ = అయ్యి; తనదు = నా; బిడ్డలన్ = పిల్లలను;
అందఱన్ = అందరిని;
తోలి = పారదోలి;
సాహస = సాహసముతో;
ఆక్రమిత = ఆక్రమించిన;
వైరులు = శత్రువులు;
అయ్యున్ = అయ్యి;
అమరావతిన్ = దేవతలరాజధానిని;
ఏలుచున్నావారు =
పరిపాలించుచున్నారు;
నీ = నీ; కున్ = కు; ఏమి = ఏమిటి;
అని = అని; విన్నవింతున్
= చెప్పుకోగలను;
హృదయేశ్వర = భర్తా;
మేలు = ఏది మంచిదో;
తలచి = ఆలోచించి;
చూడవే = చూడుము.
భావము:
ఇలా కుశలం అడిగిన భర్త కశ్యపప్రజాపతితో అదితి ఇలా అన్నది.
“ఓ నా హృదయానికి ప్రభువు అయిన పతీ! దితి బిడ్డలూ వారి
బిడ్డలూ బలవంతులై నా బిడ్డలపై సవితి సోదరులు అన్న ప్రేమ ఏమాత్రం చూపకుండా, పగబూని ఓడించి, పారద్రోలారు. సాహసంతో అమరావతిని ఆక్రమించుకొని పాలిస్తున్నారు. ఈ విషాదవార్త నీకు ఏమని
చెప్పమన్నావు. నా పిల్లలకు మేలు కలిగే మార్గం ఏదో ఆలోచిం
చూడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment