Monday, October 3, 2016

క్షీరసాగరమథనం – పురుహూతు

8-379-వ.
అయ్యవసరంబున.
8-380-సీ.
పురుహూతు నగ్గించి పుష్పాంజలులు చేసి
మునులు దీవించిరి ముదము తోడ
గంధర్వముఖ్యులు నులు విశ్వావసుఁ
డును బరావసుఁడు నింపెనయఁ బాడి
మరాంగనాజను లాడిరి; దేవతా
దుందుభులును మ్రోసె దురములోన
వాయు వహ్ని కృతాంత రుణాదులును బ్రతి
ద్వంద్వుల గెల్చి రుద్దండ వృత్తి;
8-380.1-తే.
ల్ప మృగముల సింహంబు ట్ల తోలి
మరవర్యులు దనుజుల దటు వాయ
జుఁడు పుత్తేర నారదుఁ రుగుఁ దెంచె
దైత్యహరణంబు వారింప రణినాథ!

టీకా:
            ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
            పురుహూతున్ = ఇంద్రుని; అగ్గించి = పొగిడి; పుష్పాంజలులు = పూలుగల దోసిళ్ళు; చేసి = సమర్పించి; మునులు = మునులు; దీవించిరి = ఆశీర్వదించిరి; ముదము = సంతోషము; తోడన్ = తోటి; గంధర్వ = గంధర్వులలో; ముఖ్యులు = ప్రముఖులు; ఘనులు = గొప్పవారు; విశ్వావసుడునున్ = విశ్వావసుడు; పరావసుడున్ = పరావసుడు; ఇంపు = సొంపు; ఎనయన్ = పొందికగా; పాడిరి = పాటలుపాడిరి; అమర = దేవతా; అంగనా = స్త్రీ; జనులు = జనములు; ఆడిరి = నాట్యములాడిరి; దేవతా = దేవ; దుందుభులును = భేరీలు; మ్రోసెన్ = మోగినవి; దురము = యుద్దము; లోనన్ = లో; వాయు = వాయుదేవుడు; వహ్ని = అగ్నిదేవుడు; కృతాంత = యమధర్మరాజు; వరుణ = వరుణదేవుడు; ఆదులున్ = మొదలగువారు; ప్రతిద్వంద్వులన్ = తమతోతలపడినవారిని; గెల్చిరి = జయించిరి; ఉద్దండ = అతిశయించిన; వృత్తిన్ = విధముగ; అల్ప = చిన్న. 
            మృగములన్ = జంతువులను; సింహంబులు = సింహములు; అట్ల = వలె; తోలిరి = పారదోలిరి; అమర = దేవతా; వర్యులు = శ్రేష్ఠులు; దనుజులన్ = రాక్షసులను; అదటు = అహంకారమును; వాయన్ = అణచివేయగా; అజుడు = బ్రహ్మదేవుడు; పుత్తేర = పంపించగా; నారదుడు = నారదుడు; అరుగుదెంచి = వచ్చి; దైత్య = రాక్షసుల; హరణంబున్ = సంహారమును; వారింపన్ = ఆపుటకు; ధరణీనాథ = రాజ.

భావము:
          అలా ఇంద్రుడు నముచి తల ఖండించిన సమయంలో . .
          ఓ పరీక్షిన్మహారాజా! దేవేంద్రుని మునులు పొగుడుతూ దోసిళ్ళకొద్దీ పూలతో సంతోషంగా దీవించారు. విశ్వావసువూ, పరీవసువూ అనే గంధర్వ ప్రభువులు పాటలు బహు సొంపుగా పాడారు. దేవతా స్త్రీలు నాట్యాలు చేశారు. దేవదుందుభులు మ్రోగాయి. రణరంగంలో అగ్నీ, యముడూ, వరుణుడూ, వాయువూ తమతో తలపడిన వారిని భయంకరంగా పారదోలారు. చిన్న జంతువులను సింహాలు పారద్రోలినట్లు, దేవతావీరులు రాక్షసుల అహంకారాన్ని అణచి ఓడించారు. రాక్షస సంహారాన్ని ఆపించడంకోసం బ్రహ్మదేవుడు నారదమహర్షిని పంపాడు.   


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: