Sunday, October 2, 2016

క్షీరసాగరమథనం – ఆత్మబుద్ధిఁ దలఁచి

8-377-వ.
ఇట్లాదేశించిన దివ్యవాణి పలుకు లాకర్ణించి పురందరుండు.
8-378-ఆ.
త్మబుద్ధిఁ దలఁచి యార్ద్రంబు శుష్కంబు
గాని సాధనంబు ఫేన మనుచు
ది యమర్చి దాన మరులు మెచ్చంగ
ముచి శిరముఁ ద్రుంచె నాకవిభుఁడు.

టీకా:
            ఇట్లు = ఈ విధముగ; ఆదేశించినన్ = చెప్పిన; దివ్యవాణి = ఆకాశవాణి; పలుకులున్ = మాటలను; ఆకర్ణించి = విని; పురందరుండు = ఇంద్రుడు.
            ఆత్మన్ = తన యొక్క; బుద్ధిన్ = మనసునందు; తలచి = ఆలోచించుకొని; ఆర్ద్రంబున్ = తడిది; శుష్కంబున్ = పొడిది; కాని = కానట్టి; సాధనంబున్ = సాధనము, వస్తువు; ఫేనము = సముద్రపునురుగు; అనుచున్ = అనుచు; అది = అది; అమర్చి = కూర్చి; దానన్ = దానితో; అమరులు = దేవతలు; మెచ్చంగన్ = శ్లాఘించుచుండగ; నముచి = నముచి యొక్క; శిరమున్ = తలను; త్రుంచెన్ = నరికెను; నాకవిభుడు = ఇంద్రుడు.

భావము:
          ఇలా ఇంద్రుడు దివ్యవాణి ఆకాశం నుండి పలికిన మాటలు విని. . . .
          తడిదీ పొడిదీ కాని వస్తువు సముద్రపు నురుగు ఒక్కటే అని తనలో విచారించుకున్నాడు. ఆ ప్రకారంగానే సముద్రపు నురుగు అద్దిన వజ్రం ప్రయోగించి, ఇంద్రుడు నముచి శిరస్సు నరికేసాడు. అందుకు దేవతలు మెచ్చుకున్నారు.
         

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: