బలియుద్ధయాత్ర - పురుహూతుచే
8-438-వ.
అనిన
శుకుం డిట్లనియె.
8-439-సీ.
పురుహూతుచే నొచ్చి పోయి భార్గవులచే;
బలి యెట్టకేలకు బ్రతికి వారి
వారు నాతని భక్తి వలన మెచ్చి
విశ్వజిద్యాగంబు విధితోడఁ జేయింప;
భవ్యకాంచనపట్ట బద్ధ రథము
నర్కువాజులఁ బోలు హరులుఁ గంఠీరవ;
ధ్వజము మహాదివ్యధనువుఁ బూర్ణ
8-439.1-తే.
తూణయుగళంబుఁ గవచంబుఁ దొలుత హోమ
పావకుం డిచ్చె; నమ్లాన పద్మమాలఁ
గలుష హరుఁడగు తన తాత కరుణ నొసఁగె;
సోమ సంకాశ శంఖంబు శుక్రుఁ డిచ్చె.
టీకా:
అనినన్ = అనగా;
శుకుండు = శుకుడు;
ఇట్లు = ఈ విధముగ;
అనియెన్ = పలికెను.
పురూహూతు =
ఇంద్రుని; చేన్ = వలన;
నొచ్చి = ఓడి;
పోయి = పోయి;
భార్గవుల్ = శుక్రాచార్యుల;
చేన్ = వలన;
బలి = బలి; ఎట్టకేల = చిట్టచివర;
కున్ = కు; బ్రతికి = కాపాడబడి;
వారి = ఆయనకు;
చిత్తంబురాన్ = కనికరముకలుగునట్లు;
కొల్చి = సేవించి;
శిష్యుడు =
శిష్యుడు; ఐ = అయ్యి; వర్తింపన్ = నడచుచుండగ;
వారును = ఆయనకూడ;
మెచ్చి =
సంతోషించి; విశ్వజిద్యాగంబున్ = విశ్వజిద్యాగమును;
విధి = పద్దతిప్రకారము;
తోడన్ = తోటి; చేయింపన్ = చేయించగా;
భవ్య = దివ్యమైన;
కాంచన = బంగారు;
పట్టన్ =
బట్టలుతో; బద్ద = కట్టబడిన;
రథమున్ = రథమును;
అర్కు = సూర్యుని;
వాజులన్ =
గుర్రములను;
పోలు = పోలెడి;
హరులున్ = గుర్రములు;
కంఠీరవ = సింహపు;
ధ్వజమున్ =
జండా; మహా = గొప్ప;
దివ్య = దివ్యమైన;
ధనువున్ = విల్లు;
పూర్ణ = నిండు.
తూణ = అమ్ములపొదుల;
యుగళంబున్ = జంటను;
కవచంబున్ = కవచమును;
తొలుత = ముందుగా;
హోమ = హోమ; పావకుండు =
అగ్ని; ఇచ్చెన్ = ఇచ్చెను;
అమ్లాన = వాడిపోని;
పద్మ = కలువపూల;
మాలన్ = మాలను;
కలుష = పాపములను;
హరుడు = పోగొట్టెడివాడు;
అగు = అయిన;
తన = అతని; తాత =
పితామహుడు; కరుణన్ = కృపతో;
ఒసగెన్ = ఇచ్చెను;
సోమ = చంద్రునితో;
సంకాశ =
పోలినట్టి; శంఖంబున్ = శంఖము;
శుక్రుడు = శుక్రుడు;
ఇచ్చెన్ = ఇచ్చెను.
భావము:
ఇలా
బలి వృత్తాంతం అడిగిన మహారాజు పరీక్షిత్తుతో శుకముని ఇలా
అన్నాడు.
“ఇంద్రుని చేతిలో ఓడిపోయిన పిమ్మట బలిచక్రవర్తి
శుక్రాచార్యుని దయవల్ల తేరుకున్నాడు. శుక్రునికి కనికరం కలిగేటట్లు శిష్యుడై సేవించాడు. బలి భక్తికి శుక్రుడు
మెచ్చుకున్నాడు. బలిచేత నియమపూర్వకంగా విశ్వజిద్యాగాన్ని
చేయించాడు. బలిచక్రవర్తికి హోమాగ్నినుండి బంగారువస్తాలు కప్పిన రథమూ, సూర్యుని గుర్రాలవంటి గుర్రాలూ, సింహం జెండా, గొప్పవిల్లు అంబులపొదుల జంటా, కవచమూ లభించాయి. పుణ్యాత్ముడైన అతని తాతగారు ప్రహ్లాదుడు వాడిపోని పద్మాలదండ ఇచ్చాడు. శుక్రుడు చంద్రుని వంటి తెల్లని శంఖాన్ని ఇచ్చాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment