Wednesday, October 12, 2016

జగన్మోహిని కథ - ఒక యెలదోటఁలో

8-393-సీ.
క యెలదోటఁలోనొకవీథి నొకనీడఁ
గుచకుంభముల మీఁదఁ కొంగుఁ దలఁగఁ
బరికాబంధంబుఁ గంపింప నుదుటిపైఁ
జికురజాలంబులు జిక్కుపడఁగ
నుమానమై మధ్య ల్లాడఁ జెక్కులఁ
ర్ణకుండల కాంతి గంతు లిడఁగ
నారోహభరమున డుగులుఁ దడఁబడ
దృగ్దీప్తి సంఘంబు దిశలఁ గప్ప
8-393.1-తే.
వామకరమున జాఱిన లువఁ బట్టి
నక నూపుర యుగళంబు ల్లనంగఁ
గంకణంబుల ఝణఝణత్కార మెసఁగ
బంతిచే నాడు ప్రాయంపుటింతిఁ గనియె.

టీకా:
          ఒక = ఒక; ఎలదోట = ఉద్యానవనము; లోన్ = అందు; ఒక = ఒక; వీథిన్ = చెట్లవరుస; ఒక = ఒక; నీడన్ = చెట్టునీడయందు; కుచ = స్తనములనెడి; కుంభముల = కుండల; మీదన్ = పైన; కొంగున్ = పైట; తలగన్ = తొలగిపోగా; కబరికాబంధంబున్ = జుట్టుముడి; కంపింపన్ = చలించుచుండగ; నుదురు = ఫాలభాగము; పైన్ = మీద; చికుర = ముంగురుల; జాలంబులున్ = సమూహములు; చిక్కుపడగన్ = ముసురుకొనుచుండగ; అనుమానము = ఉందాయనిసందేహము; ఐ = కలిగెడిదై; మధ్యము = నడుము; అల్లాడన్ = కదులాడుతుండగా; చెక్కులన్ = చెక్కిళ్ళపై; కర్ణకుండల = చెవికుండలముల; కాంతి = ప్రకాశము; గంతులు = చిందులు; ఇడగన్ = వేయుచుండగ; ఆరోహ = స్త్రీలపిరుదుల; భరమునన్ = బరువువలన; అడుగులు = పాదాలు; తడబడన్ = తడబడుచుండగ; దృక్ = చూపుల; దీప్తి = కాంతుల; సంఘంబున్ = సమూహములు; దిశలన్ = సర్వదిశలను; కప్పన్ = పరచుకొనగా. 
          వామ = ఎడమ; కరమునన్ = చేతితో; జాఱిన = జారిపోయిన; వలువన్ = బట్టను; పట్టి = పట్టుకొని; కనక = బంగారు; నూపుర = కాలియందెలు; యుగళంబున్ = రెండును (2); గల్లు = గలగలమని; అనగన్ = అనుచుండ; కంకణంబులన్ = బంగారపుగాజుల; ఝణఝణత్ = ఝణ ఝణ; కారము = అనెడి శబ్దములు; ఎసగన్ = అతిశయించగా; బంతి = బంతి; చేన్ = తోటి; ఆడు = ఆడెడి; ప్రాయంపు = మంచివయసులోనున్న; ఇంతిన్ = స్త్రీని; కనియె = చూచెను.

భావము:
          అలా మాయమయిన విష్ణువు ఎక్కడికి వెళ్ళాడా అని శంకరుడు చూస్తున్నాడు. అంతలో ఆయన ఎదుట ఒక ఉద్యానవనం; వనంలో ఒక చెట్ల వరుస; అందులో ఒక చెట్టు నీడలో ఒక ఎలప్రాయపు సుందరాంగి కనబడింది. ఆమె కుచకుంభముల మీద పైట తొలగింది. కొప్పుముడి వీడింది . నుదుట ముంగురులు ముసురుతున్నాయి. నడుము ఉందాలేదా అనే అనుమానానికి అవకాశమిస్తూ కదలాడుతోంది. చెవుల కమ్మల కాంతులు చెక్కిళ్ళపై చిందుతున్నాయి. పిరుదుల బరువుతో పాదాలు తడబడుతున్నాయి. తళుకు చూపులు దిక్కులలో పిక్కటిల్లుతున్నాయి. జారిపోయిన చీర కుచ్చెళ్ళను ఎడమచేతితో పట్టుకుంది. బంగారు కాలిఅందెల గలగలలూ చేతికంకణాల ఝణ ఝణాలూ అతిశయిస్తున్నాయి. అలా బంతితో ఆడుతూ ఉన్న ఆ యింతిని శంకరుడు చూసాడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: