Thursday, June 30, 2016

క్షీరసాగరమథనం – ఆలోల

కాలకూటవిషము పుట్టుట
8-215-క.
లోల జలధి లోపల
నాలో నహి విడిచి సురలు సురులుఁ బఱవం
గీలా కోలాహలమై
హాలాహల విషము పుట్టె వనీనాథా!
టీకా:
            ఆలోల = కల్లోలమైన; జలధి = సముద్రము {జలధి - జలమునకు నిధి, సముద్రము}; లోపలన్ = లోపలనుండి; ఆలోన్ = ఆ సమయునందు; అహిన్ = పామును; విడిచి = విడిచిపెట్టి; సురలున్ = దేవతలు; అసురులున్ = రాక్షసులు; పఱవన్ = పరుగెత్తుచుండగా; కీలా = మంటలతో; కోలాహలము = కోలాహలముతో కూడినది; ఐ = అయ్యి; హాలాహలము = హాలాహలము అనెడి; విషము = విషము; పుట్టెన్ = పుట్టినది; అవనీనాథ = రాజా.
భావము:
            పరీక్షిన్మహారాజా! అల్లకల్లోలమైన ఆ పాలకడలిలో నుండి అగ్నిజ్వాలల కోలాహలంతో కూడిన “హాలాహలము” అనే మహావిషము పుట్టింది. అది చూసి భయంతో దేవతలూ, రాక్షసులూ పట్టుకున్న నాగరాజు వాసుకిని వదలిపెట్టి పారిపోసాగారు.
            లకార ప్రాసతో హాలాహల, కోలహలాలకు జత కట్టించిన బమ్మెరవారి పద్యం మధురాతి మధురం
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: