8-182-వ.
అని పలికి
కొలువు కూటంబున నసుర నికర పరివృతుండై నిఖిల లోకరాజ్యలక్ష్మీ సహితుండై యఖిల విబుధ వీర విజయాహంకార నిజాలంకారుండై సుఖంబునం గొలువున్న విరోచన
నందనుంగని శచీవిభుం డుత్తమ సచివుండునుం బోలె
స్వాంతఁ వచనంబుల శాంతిం బొందించి పురుషోత్తమ శిక్షితంబైన నీతిమార్గంబున శంబరునికిం బ్రియంబు చెప్పి; యరిష్టనేమి ననునయించి
త్రిపురవాసులగు
దానవుల నొడంబఱచి; జంభుని సమ్మతంబు చేకొని; హయగ్రీవుని విగ్రహంబు
మాన్చి; నముచి తారక బాణాదులతో సఖ్యంబు నెఱపి;
విప్రచిత్తికిం
బొత్తు హత్తించి; శకుని విరోచన ప్రహేతులకుఁ బోరామి చూపి మయ
మాలి సుమాలి ప్రముఖులకు మైత్రి
యెఱింగించి; కుంభ నికుంభులకు సౌజన్యంబుఁ గైకొలిపి;
పౌలోమ
కాలకేయ నివాత కవచాదుల యెడ బాంధవంబు ప్రకటించి; వజ్రదంష్ట్ర్రికి వశుండై; యితర దానవ దైత్య సమూహంబువలన నతిస్నేహంబు సంపాదించి; మనకు నక్క చెలియండ్ర బిడ్డలకు నొడ్డారంబు
లేమిటికి? నేక కార్యపరత్వంబున నడ్డంబు లేక బ్రదుకుద;
మన్యోన్య
విరోధంబు లేల? తొల్లి యన్యోన్య విరోధంబున నలంగితి; మిది మొదలు దనుజ దివిజ సముదయంబులకు రాజు
విరోచననందనుండ; మన మందఱ మతని పంపు చేయంగలవార; ముభయ కులంబును వర్ధిల్లు నట్టి యుపాయం
బెఱింగింతు నని యమృతజలధిమథన ప్రారంభ కథనంబు దెలియం
జెప్పె; నట్లు సురాసుర యూథంబులు బలారాతి బలిప్రముఖం బులై పరమోద్యోగంబున సుధాసంపాదనాయత్త చిత్తులై యైకమత్యంబు నొంది యమందగమనంబున మందరనగంబునకుం జని.
టీకా:
అని = అని; పలికి =
చెప్పి; కొలువు = కొలువు;
కూటంబునన్ = కూటమునందు;
సుర = దేవతా;
నికర =
సమూహములచే; పరివృతుండు = చుట్టబడినవాడు;
ఐ = అయ్యి; నిఖిల = సమస్తమైన;
లోక =
లోకములతోకూడిన;
రాజ్య = రాజ్యము యనెడి;
లక్ష్మీ = సంపద;
సహితుండు = కలిగినవాడు;
ఐ = అయ్యి; అఖిల = సర్వ;
విబుధ = దేవతా;
వీర = వీరులను;
విజయ = జయించిన;
అహంకార = అహంకారముచే;
నిజాలంకారుండు = గర్వముగలవాడు {నిజాలంకారుడు - నిజ (తననుతనే)
అలంకారుడు (అలంకరించుకొన్నవాడు),
గర్వముగలవాడు};
ఐ = అయ్యి; సుఖంబునన్ = సుఖముగ;
కొలువు = సభతీర్చి;
ఉన్న = ఉన్నట్టి;
విరోచనందనున్ = బలిని {విరోచననందనుడు -
విరోచనుని పుత్రుడు,
బలి}; కని = చూసి;
శచీవిభుండు = ఇంద్రుడు;
ఉత్తమ = మంచి;
సచివుండునున్ = మంత్రి;
పోలెన్ = వలె;
స్వాంతన్ = మనసును;
వచనంబులన్ = మాటలతో;
శాంతిన్ = శాంతిని;
పొందించి = చెందించి;
పురుషోత్తమ = విష్ణుమూర్తిచే;
శిక్షితంబు
= నేర్పబడినది;
ఐన = అయిన; నీతిమార్గంబునన్ = నీతిమార్గమునందు;
శంబరుని =
శంబరుని; కిన్ = కి; ప్రియంబు = ఇష్టమును;
చెప్పి = తెలిపి;
అరిష్టనేమిన్ =
అరిష్టనేమిని;
అనునయించి = బుజ్జగించి;
త్రిపుర = త్రిపురముల;
వాసులు =
నివసించెడివారు;
అగు = అయిన;
దానవులన్ = రాక్షసులను {దానవులు - కశ్యపునకు
దనువునందు పుట్టిన సంతతి,
రాక్షసులు}; ఒడంబరచి = ఒప్పించి;
జంభుని = జంభుని;
సమ్మతంబు = అంగీకారము;
చేకొని = తీసుకొని;
హయగ్రీవుని = హయగ్రీవుని;
విగ్రహంబున్
= వైరము; మాన్చి = మానిపించివేసి;
నముచి = నముచి;
తారక = తారకుడు;
బాణ = బాణుడు;
ఆదుల్ = మున్నగువారి;
తోన్ = తోటి;
సఖ్యంబున్ = స్నేహము;
నెఱపి = సాగించి;
విప్రచిత్తి = విప్రచిత్తి;
కిన్ = కి; పొత్తు = స్నేహితము;
హత్తించి =
కలిగించి; శకుని = శకుని;
విరోచన = విరోచనుడు;
ప్రహేతుల్ = ప్రహేతుడు;
కున్ =
లకు; పోరామి = స్నేహము {పోరామి - పోరు లేమి,
స్నేహము}; చూపి = చూపించి;
మయ =
మయుడు; మాలి = మాలి;
సుమాలి = సుమాలి;
ప్రముఖుల్ = మొదలగువారి;
కున్ = కు; మైత్రి = మిత్రత్వము;
ఎఱింగించి = తెలిపి;
కుంభ = కుంభుడు;
నికుంభుల్ =
నికుంభుల; కున్ = కు; సౌజన్యంబున్ = మంచితనము;
కైకొల్పి = ఏర్పరచి;
పౌలోమ =
పౌలోములు {పౌలోములు - మారీచునకు పులోమ యందు కలిగిన 60,000
దానవ సంతతి};
కాలకేయ =
కాలకేయులు {కాలకేయులు - మారీచునకు కలక యందు కలిగిన 1,400
దానవ సంతతి};
నివాత =
నివాతులు {నివాతము - బాణములచే భేదింపరానిది};
కవచ = కవచులు;
ఆదుల = మున్నగువారి;
ఎడన్ = అందు;
బాంధవంబు = బంధుత్వము;
ప్రకటించి = సిద్దించుకొని;
వజ్రదంష్ట్రి =
వజ్రదంష్ట్రి;
కిన్ = కి; వశుండు = లొంగినవాడు;
ఐ = అయ్యి; ఇతర = మిగలిన;
దానవ =
దానవుల; దైత్య = దైత్యుల;
సమూహంబున్ = నికరముల;
వలన = నుండి;
అతి = మిక్కిలి;
స్నేహంబున్ = మిత్రత్వమును;
సంపాదించి = సంపాదించి;
మన = మన; కున్ = కు; అక్కచెలియండ్ర = సోదరీమణుల;
బిడ్డల = పిల్లల;
కున్ = కు; ఒడ్డారంబులు = పంతములు;
ఏమిటి = ఎందు;
కిన్ = కు; ఏక = ఏకోన్ముఖమైన;
కార్యపరత్వంబునన్ =
పనులుచేసికొనుటద్వారా;
అడ్ఢంబున్ = ఎదురు;
లేక = లేకుండగ;
బ్రదుకుదము =
జీవించెదము;
అన్యోన్య = మనలోమనకి;
విరోధంబులు = శత్రుత్వములు;
ఏల = ఎందులకు;
తొల్లి = ఇంతకు ముందు;
అన్యోన్య = మనలోమనకి;
విరోధంబునన్ = శత్రుత్వములవలన;
నలింగితిమి = నలిగిపోతిమి;
ఇది = ఇప్పటి;
మొదలు = నుండి;
దనుజ = దానవుల;
దివిజ =
దేవతల {దివిజులు - స్వర్గమున పుట్టినవారు,
దేవతలు}; సముదయంబుల్ = సమూహముల;
కున్ = కు; రాజు = రాజు;
విరోచననందనుండ = బలియే;
మనము = మనము;
అందఱము = అందఱము;
అతని = అతని యొక్క;
పంపు = ఆజ్ఞప్రకారము;
చేయంగలవారము = చేసెడివారము;
ఉభయ = రెండు
(2); కులంబునున్ = కుటుంభములును;
వర్ధిల్లున్ = అభివృద్ధిచెందును;
అట్టి =
అటువంటి; ఉపాయంబున్ = ఉపాయమును;
ఎఱింగింతున్ = తెలిపెదను;
అని = అని; అమృతజలధి =
పాలసముద్రము;
మథన = చిలుకు;
ప్రారంభ = ప్రయత్నము;
కథనంబు = సంగతి;
తెలియన్ =
తెలియునట్లు;
చెప్పెన్ = చెప్పెను;
అట్లు = అలా;
సుర = దేవత;
అసుర = రాక్షస;
యూథంబులు = సమూహములు;
బలారాతి = ఇంద్రుడు {బలారాతి - బలి యొక్క అరాతి (శత్రువు),
ఇంద్రుడు}; బలి = బలి; ప్రముఖంబులు = నాయకులుగాగలవి;
ఐ = అయ్యి; పరమ = మిక్కిలి;
ఉద్యోగంబునన్ = పూనికతో;
సుధా = అమృతమును;
సంపాదనా = సంపాదించవలెననెడి;
ఆయత్త =
నిశ్చయించుకొన్న;
చిత్తులు = మనసులుగలవారు;
ఐ = అయ్యి; ఐకమత్యంబున్ =
ఐకమత్యమును;
ఒంది = పొంది;
అమంద = వేగముగల;
గమనంబునన్ = నడకలతో;
మందర = మందర
యనెడి; నగంబున్ = పర్వతమున;
కున్ = కు; చని = వెళ్ళి.
భావము:
బలి చక్రవర్తి కొలువు కూటములో చేరి అతనిని సేవించారు.
సకల లోకాలలోని రాజ్యాలనూ గెలుచుకున్న వైభవంతోనూ, దేవతా వీరులను ఓడించిన గర్వంతోనూ
బలిచక్రవర్తి సుఖంగా ఉన్నాడు. శచీదేవి భర్త అయిన దేవేంద్రుడు చక్కటి మంత్రి వలె ఓదార్పు మాటలతో
విరోచననుని పుత్రుడు అయిన బలిచక్రవర్తికి ప్రశాంతత
కలించాడు. పురుషోత్తముడైన విష్ణువు నియమించిన నీతిమార్గాన్ని అనుసరించి దేవతా ప్రముఖులందరు రాక్షసులతో
స్నేహంగా మెలగసాగారు. అలా శంబరాసురునికి ఇచ్చకపు
మాటలు చెప్పి; అరిష్టనేమితో అనునయంగా మాట్లాడి; త్రిపురాలలో నివసించే దానవులతో ఒప్పుకోలు
మాటలు జరిపి;
జంభాసురుని ఒప్పుకోలు సంపాదించి; హయగ్రీవాసురుని వైరం మాన్పించి; నముచి, తారక, బాణాసురులతో మిత్రత్వం సాగించి; విప్రచిత్తితో స్నేహం కలుపుకుని; శకుని, విరోచనస ప్రహేతులచే రాకపోకలు జరిపి; మయ, మాలి,
సుమాలి మొదలగు రాక్షస ప్రముఖులకి స్నేహం
చూపించి;
కుంభ నికుంభాసురులతో సౌజన్యం చేపట్టి; పౌలోమి, కాలకేయ, నివాత కవచాది రాక్షస వీరుల పట్ల స్నేహంతో బాంధవ్యాలు కలిపి
మాట్లాడుతూ;
వజ్రదంష్ట్రివద్ద లొంగి మెసలి; మిగిలిన దానవులు, దైత్యులు మున్నగు రాక్షసుల ఎడ అతిస్నేహం పెంపొందించుకుని; మనం మనం అక్కచెల్లెళ్ళ పిల్లలం మనలో మనకి
దెబ్బలాటలు ఎందుకు? ఇన్నాళ్ళు మనలో మనం గొడవలు పడి బాగా
నలిగిపోయాం కదా.అందుచేచ ఇకనుండి విరోచనుని కుమారుడు అయిన బలిచక్రవర్తే రాక్షసులం, దేవతలం మనం అందరకు మహారాజు. మనం అందరం అతని ఆజ్ఞకు లోబడి ఉందాం అని చెప్పారు. ఇంకా మన రెండు వంశాలు చక్కగా
వర్థిల్లు మార్గం చెప్తాం అని, బలి చక్రవర్తి నాయకత్వంలో ఐకమత్యంతో దేవతలు రాక్షసులు పట్టుబట్టి పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించటానికి
ఒప్పించారు.అందరూ కలిసి వడివడిగా మంథర పర్వతం దగ్గరకి
వెళ్ళారు.
८-१८२-व.
अनि
पलिकि कोलुवु कूटंबुन नसुर निकर परिवृतुंडै निखिल लोकराज्यलक्ष्मी सहितुंडै यखिल
विबुध वीर विजयाहंकार निजालंकारुंडै सुखंबुनं गोलुवुन्न विरोचन नंदनुं गनि
शचीविभुं डुत्तम सचिवुंडुनुं बले स्वांतँ वचनंबुल शांतिं बोंदिंचि पुरुषोत्तम
शिक्षितंबैन नीतिमार्गंबुन शंबरुनिकिं ब्रियंबु चेप्पि; यरिष्टनेमि ननुनयिंचि त्रिपुरवासुलगु दानवुल
नोडंबर्रचि; जंभुनि
सम्मतंबु चेकोनि; हयग्रीवुनि
विग्रहंबु मान्चि; नमुचि
तारक बाणादुलतो सख्यंबु नेर्रपि; विप्रचित्तिकिं बोत्तु हत्तिंचि; शकुनि विरोचन प्रहतुलकुँ
बोरामि चूपि मय मालि सुमालि प्रमुखुलकु मैत्रि येर्रिंगिंचि; कुंभ निकुंभुलकु
सौजन्यंबुँ गैकोलिपि; पौलम कालकय निवात कवचादुल येड बांधवंबु प्रकटिंचि; वज्रदंष्ट्र वशुंडै; यितर दानव दैत्य
समूहंबुवलन नतिस्नहंबु संपादिंचि; मनकु नक्क चेलियंड्र बिड्डलकु नोड्डारंबु लेमिटिकि? नेक कार्यपरत्वंबुन
नड्डंबु लेक ब्रदुकुद; मन्योन्य विरोधंबु लेल? तोल्लि यन्योन्य विरोधंबुन नलंगिति; मिदि मोदलु दनुज दिविज
समुदयंबुलकु राजु विरोचननंदनुंड; मन मंदर्र मतनि पंपु चेयंगलवार; मुभय कुलंबुनु वर्धिल्लु
नट्टि युपायं बेर्रिंगिंतु ननि यमृतजलधिमथन प्रारंभ कथनंबु देलियं जेप्पे; नट्लु सुरासुर यूथंबुलु
बलाराति बलिप्रमुखं बुलै परमद्योगंबुन सुधासंपादनायत्त चित्तुलै यैकमत्यंबु नोंदि
यमंदगमनंबुन मंदरनगंबुनकुं जनि.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment