8-174-క.
అమృతోత్పాదన యత్నము
విమల మతిం జేయు టొప్పు; వేల్పులు! వినుఁడీ
యమృతంబుఁ ద్రావి జంతువు
లమృతగతిన్ బ్రతుకుచుండు నాయుర్వృద్ధిన్.
టీకా:
అమృత = అమృతమును;
ఉత్పాదన = తయారుచేసెడి;
యత్నమున్ = ప్రయత్నమును;
విమల = నిర్మలమైన;
మతిన్ =
మనసులతో; చేయుట = చేయుట;
ఒప్పు = మేలు;
వేల్పులు = దేవతలు;
వినుడీ = వినండి;
అమృతంబున్ = అమృతమును;
త్రావి = తాగినచో;
జంతువుల్ = జీవులు;
అమృత = మరణములేని;
గతిన్ = విధముగ;
బ్రతుకుచున్ = జీవించుచు;
ఉండున్ = ఉండును;
ఆయుర్ = ఆయుష్షు;
వృద్ధిన్ = పెపొందుటచేత.
భావము:
ఓ దేవతలారా! వినండి. మీరు అమృతాన్ని పుట్టించే ప్రయత్నం స్వచ్ఛమైన
మనసులతో చేయటం మేలు. అమృతాన్ని త్రాగినవారికి ఆయుస్సు
పెరుగుతుంది. మరణంలేని మనుగడ లభిస్తుంది.
८-१७४-क.
अमृतोत्पादन यत्नमु
विमल मतिं जेयु
टोप्पु; वेल्पुलु! विनुँडी
यमृतंबुँ द्रावि
जंतुवु
लमृतगतिन्
ब्रतुकुचुंडु नायुर्वृद्धिन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment