8-193-వ.
తదనంతరంబ.
8-194-క.
హరియును దేవానీకము
నురగేంద్రుని తలలు పట్టనుద్యోగింపన్
హరిమాయా పరవశులై
సురవిమతులు కూడి పలుకఁ జొచ్చిరి కడిమిన్.
టీకా:
తదనంతరంబ = తరువాత.
హరియును = విష్ణువు;
దేవ = దేవతల;
అనీకమున్ = సమూహము;
ఉరగ = సర్పములకు;
ఇంద్రునిన్ = ప్రభువుని;
తలలున్ = తలవైపున;
పట్టన్ = పట్టుకొనుటకు;
ఉద్యోగింపన్ = యత్నిస్తుండగా;
హరి =
విష్ణుని; మాయా = మాయకు;
పరవశులు = లొంగినవారు;
ఐ = అయ్యి; సురవిమతులు =
రాక్షసులు; కూడి = అందరుకలిసి;
పలుకన్ = వాదులాడ;
చొచ్చిరి = మొదలిడిరి;
కడిమిన్ = పట్టుదలతో.
భావము:
అటుపిమ్మట.
విష్ణువూ, దేవతలూ వాసుకి తలవైపు
పట్టుకోడానికి సిద్ధపడసాగారు. విష్ణైవ మాయ కమ్మిన రాక్షసులు అందరూ ఒళ్ళు తెలియని
పట్టుదలలతో వాదులాటకు దిగారు.
८-१९३-व.
तदनंतरंब.
८-१९४-क.
हरियुनु देवानीकमु
नुरगेंद्रुनि तललु
पट्टनुद्योगिंपन्
हरिमाया परवशुलै
सुरविमतुलु कूडि पलुकँ
जोच्चिरि कडिमिन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment