Wednesday, June 15, 2016

క్షీరసాగరమథనం – వారలు గొలువఁగ

8-189-క.
వాలు గొలువఁగ హరియును
వారాన్నిధి కరుగు మనఁగ సుధాధరమున్
వారిజనయనునిఁ గొంచు న
వారితగతిఁ జనియె విహగల్లభుఁ డఱుతన్.
8-190-క.
ని జలరాశి తటంబున
జాక్షుని గిరిని డించి వందనములు స
ద్వినుతులు జేసి ఖగేంద్రుఁడు
నివినియెను భక్తి నాత్మవనంబునకున్.
8-191-వ.
అప్పుడు.
టీకా:
            వారలు = వారు; కొలువంగ = సేవించుచుండగ; హరియును = విష్ణువు; వారాన్నిధి = సాగరమున; కున్ = కు; అరుగుము = వెళ్లుము; అనగన్ = చెప్పగా; వసుధాధరమున్ = పర్వతమును {వసుధాధరము - వసుధ (భూమిని) ధరము (ధరించునది), పర్వతము}; వారిజనయనునిన్ = హరిని {వారిజనయనుడు - వారిజము (పద్మముల) వంటి నయనుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; కొంచున్ = తీసుకొని; అవారిత = ఆపలేని; గతిన్ = వేగముతో; జనియెన్ = వెళ్లెను; విహగవల్లభుడు = గరుత్మంతుడు; అఱుతన్ = దగ్గరగా.
            చని = వెళ్లి; జలరాశి = సముద్రము; తటంబునన్ = గట్టుమీద; వనజాక్షుని = హరిని; గిరిని = పర్వతమును; డించి = దించి; వందనములు = నమస్కారములు; సద్వినుతులు = స్తోత్రములు; చేసి = చేసి; ఖగేంద్రుడు = గరుడుడు {ఖగేంద్రుడు - ఖగము (పక్షుల)కు ఇంద్రుడు (ప్రభువు), గరుత్మంతుడు}; పనివినయెను = సెలవుతీసుకొనెను; భక్తిన్ = భక్తితో; ఆత్మ = తన; భవనంబున్ = నివాసమున; కున్ = కు.
            అప్పుడు = అప్పుడు.
భావము:
            దేవదానవులు విష్ణుమూర్తిని సేవించుకున్నారు. విష్ణుమూర్తి గరుడుని పాల సముద్రం వద్దకు తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. గరుడుడు ఆ పర్వతాన్నీ, విష్ణుమూర్తినీ మూపుపై ధరించి ఆటంకం లేకుండాఎగురుతూ తీసుకెళ్ళాడు.
            అలా గరుడుడు తీసుకెళ్ళి పాలకడలి ఒడ్డున విష్ణువునూ, మందరపర్వతాన్నీ దించాడుమ భక్తితో నమస్కరించి శలవు తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు.
            అంతట.
८-१८९-क.
वारलु गोलुवँग हरियुनु
वारान्निधि करुगु मनँग वसुधाधरमुन्
वारिजनयनुनिँ गोंचु न
वारितगतिँ जनिये विहगवल्लभुँ डर्रुतन्.
८-१९०-क.
चनि जलराशि तटंबुन
वनजाक्षुनि गिरिनि डिंचि वंदनमुलु स
द्विनुतुलु जेसि खगेंद्रुँडु
पनिविनियेनु भक्ति नात्मभवनंबुनकुन्.
८-१९१-व.
अप्पुडु.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: