8-176-వ.
అని
యాదేశించి.
8-177-క.
అంతాది రహితుఁ డచ్యుతుఁ
డంతర్ధానంబు నొందె; నజ ఫాలాక్షుల్
సంతోషంబునఁ దమతమ
కాంతాలయములకుఁ జనిరి గౌరవ మొప్పన్.
టీకా:
అని = అని; ఆదేశించి = ఆజ్ఞాపించి.
అంతాదిరహితుడు =
విష్ణుమూర్తి {అంతాదిరహితుడు - అంతాది (ఆద్యంతములు)
రహితుడు (లేనివాడు), విష్ణువు};
అచ్యుతుడు = విష్ణుమూర్తి {అచ్యుతడు - భ్రంశమునొందని వాడు,
విష్ణువు}; అంతర్ధానంబు = మాయమగుటను;
ఒందెన్ = పొందెను;
అజ = బ్రహ్మదేవుడు
{అజుడు - పుట్టుకలేనివాడు,
బ్రహ్మ}; ఫాలాక్షుల్ = శివుడు {ఫాలాక్షుడు - ఫాలమున
(నుదుట) అక్షుడు (కన్నుగలవాడు),
శివుడు}; సంతోషంబునన్ = సంతోషముతో;
తమతమ =
వారివారి; కాంతాలయముల్ = నివాసములు {కాంతాలయము - కాంత (భార్య) ఉండెడి ఆలయము
(ఇల్లు), నివాసము}; కున్ = కు; చనిరి = వెళ్ళిరి;
గౌరవము = చక్కదనము;
ఒప్పన్ =
ఒప్పునట్లు.
భావము:
అలా క్షీరసాగర మథనం చేయమని ఆజ్ఞాపించి.
ఆదీ ఆంతమూ లేని అచ్యుత భగవానుడు అయిన శ్రీమహా విష్ణువు అదృశ్యం
అయ్యాడు. బ్రహ్మదేవుడూ, పరమశివుడూ సంతోషంగా తమతమ నిలయాలకు వెళ్ళారు.
८-१७६-व.
अनि यादेशिंचि.
८-१७७-क.
अंतादि रहितुँ
डच्युतुँ
डंतर्धानंबु नोंदे;
नज फालाक्षुल्
संतोषंबुनँ दमतम
कांतालयमुलकुँ
जनिरि गौरव मोप्पन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment