సముద్రమథనయత్నము
8-192-సీ.
భూనాథ! వినవయ్య భోగీంద్రు వాసుకిఁ;
బిలిపించి యతనికిఁ బ్రియము జెప్పి
ఫలభాగ మీ నొడఁబడి సమ్మతునిఁ జేసి;
మెల్లన చేతుల మేను నివిరి
నీవ కా కెవ్వరు నేర్తు?
రీ పని
కియ్య;
కొమ్మని యతని కైకోలు పడసి
కవ్వంపుఁ గొండ నిష్కంటకంబుగఁ జేసి;
ఘర్షించి యతని భోగంబుఁ జుట్టి
8-192.1-ఆ.
కడఁగి యమృతజలధిఁ గలశంబుఁ గావించి
త్రచ్చు నవసరమునఁ దలఁపు లమర
బద్ధవస్త్రకేశభారులై యా రెండు
గములవారు తరువఁ గదిసి రచట.
టీకా:
భూనాథ = రాజా;
విను = వినుము; అయ్య = తండ్రి;
భోగి = సర్పములకు;
ఇంద్రున్ = ప్రభువుని;
వాసుకిన్ =
వాసుకుని; పిలిపించి = పిలిపించి;
అతని = అతని;
కిన్ = కి; ప్రియముజెప్పి =
నచ్చచెప్పి;
ఫల = ఫలితములో;
భాగము = వంతు;
ఈన్ = ఇచ్చుటకు;
ఒడబడి = ఒప్పుకొని;
సమ్మతునిజేసి = ఒప్పించి;
మెల్లన = మెల్లగా;
చేతులన్ = చేతులతో;
మేను = దేహమును;
నివిరి = దువ్వి;
నీవ = నీవుమాత్రము;
కాక = తప్పించి;
ఎవ్వరు = ఎవరు;
నేర్తురు =
సమర్థులు; ఈ = ఈ; పని = కార్యమున;
కున్ = కు; ఇయ్యకొమ్ము = అంగీకరింపుము;
అని =
అని; అతని = అతని యొక్క;
కైకోలు = అంగీకారము;
పడసి = పొంది;
కవ్వంపు =
కవ్వముగానున్న;
కొండన్ = పర్వతమును;
నిష్కంటకంబుగన్ = ముళ్ళులేనిదిగ;
చేసి =
చేసి; ఘర్షించి = రాపిడిచేసి;
అతని = అతని;
భోగంబున్ = శరీరమును;
చుట్టి =
చుట్టి.
కడగి = పూని;
అమృతజలధిన్ = పాలసముద్రమును;
కలశంబుగాన్ = కుండగా;
కావించి = చేసుకొని;
త్రచ్చు = చిలికెడి; అవసరమునన్ = సమయములో;
తలపులు = బారులు;
అమరన్ = తీరి;
బద్ద =
బిగించిన; వస్త్ర = బట్టలు;
కేశభారులు = జుట్టుముడులుగలవారు;
ఐ = అయ్యి; ఆ = ఆ; రెండు = రెండు (2);
గముల = పక్షముల;
వారున్ = వారు;
తరువన్ = చిలుకుటకు;
కదిసిరి = తలపడిరి; అచటన్ = అక్కట.
భావము:
ఓ పరీక్షిన్మహారాజా! దేవతలూ, రాక్షసులూ
సర్పరాజైన వాసుకిని పిలిపించారు. అతనికి ప్రీతి కలిగేలా మాట్లాడారు. అమృతంలో
అతనికి కూడా భాగం ఇవ్వటానికి ఒప్పుకున్నారు. మెల్లగా శరీరాన్ని దువ్వి స్నేహం కనబరచారు. “నీ కంటే సమర్థులు ఇంకెవరూ లేరు” అని పొగుడుతూ, కవ్వపు
త్రాడుగా ఉండటానికి ఒప్పించారు. వాసుకికి ముళ్ళు గుచ్చకోకుండా ఉండటానికి,
మందరపర్వతాన్ని చదును చేశారు. ఆ పెద్ద కొండను కవ్వంగా తీసుకుని, వాసుకిని త్రాడుగా
చుట్టి, పాలసముద్రాన్ని కుండగా చేశారు. రెండు పక్షాలవారు రెండువైపులా బారులు తీరి,
వస్త్రాలు ఎగగట్టుకున్నారు. జుట్టులు గట్టిగా ముడులు వేసుకుని, పాలసముద్రాన్ని
చిలకడానికి తలపడ్డారు.
८-१९२-सी.
भूनाथ! विनवय्य भोगींद्रु
वासुकिँ;
बिलिपिंचि यतनिकिँ
ब्रियमु जेप्पि
फलभाग मी नोडँबडि
सम्मतुनिँ जसि;
मेल्लन चेतुल मेनु निविरि
नीव का केव्वरु नेर्तु?
री पनि किय्य;
कोम्मनि यतनि कैकोलु पडसि
कव्वंपुँ गोंड निष्कंटकंबुगँ
जेसि;
घर्षिंचि यतनि भोगंबुँ
जुट्टि
८-१९२.१-आ.
कडँगि यमृतजलधिँ गलशंबुँ
गाविंचि
त्रच्चु नवसरमुनँ दलँपु
लमर
बद्धवस्त्रकेशभारुलै या
रेंडु
गमुलवारु तरुवँ गदिसि
रचट.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment