Tuesday, June 7, 2016

క్షీరసాగరమథనం – కయ్యంబు జేయ


సురాసురలుస్నేహము
8-178-క.
య్యంబు జేయ నొల్లక
నెయ్యంబున నతులు పెట్టి నిర్జర నికరం
బియ్యప్పనములు పెట్టుచుఁ
దియ్యంబునఁ గొల్చె బలిని దేవద్వేషిన్.
టీకా:
            కయ్యంబున్ = పోరు; చేయన్ = సలుపను; ఒల్లక = ఒప్పుకొనకుండ; నెయ్యంబునన్ = స్నేహముతో; నతులు = వినమ్రతలు; పెట్టి = చూపుచూ; నిర్జర = దేవతా; నికరంబు = సమూహములు; ఇయ్యన్ = ఇచ్చుటకు; అప్పనములు = కానుకలు; పెట్టుచున్ = ఇచ్చుచు; తియ్యంబునన్ = ఇష్టముగా; కొల్చె = కొలిచిరి; బలిని = బలిని; దేవద్వేషిన్ = రాక్షసుని {దేవద్వేషి - దేవతలను ద్వేషించువాడు, రాక్షసుడు}.
భావము:
            దేవతలు యుద్ధం మాట విడిచిపెట్టారు. దేవతా శత్రువు అయిన బలిచక్రవర్తి పట్ల దేవతలు అందరూ స్నేహాన్నీ, భక్తిని కనబరచారు. అతని ఆజ్ఞలను సంతోషంగా పాలించారు.
८-१७८-क.
कय्यंबु जेय नोल्लक
नेय्यंबुन नतुलु पेट्टि निर्जर निकरं
बिय्यप्पनमुलु पेट्टुचुँ
दिय्यंबुनँ गोल्चे बलिनि देवद्वेषिन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: