మంధరగిరిని తెచ్చుట
8-183-సీ.
వాసవ వర్ధకి వాఁడిగాఁ జఱచిన;
కుద్దాలముఖములఁ గొంత ద్రవ్వి
ముసలాగ్రముల జొన్పి మొదలి పాఁ తగలించి;
దీర్ఘ పాశంబులఁ ద్రిండు చుట్టి
పెకలించి బాహుల బీడించి కదలించి;
పెల్లార్చి తమతమ పేరు వాడి
పెఱికి మీఁదికి నెత్తి పృథుల హస్తంబులఁ;
దలల భుజంబులఁ దరలకుండ
8-183.1-తే.
నాని మెల్లన కుఱుతప్పుటడుగు లిడుచు
భార మధికంబు మఱవక పట్టుఁ డనుచు
మందరనగంబుఁ దెచ్చి రమందగతిని.
దేవ దైత్యులు జలరాశి తెరువు పట్టి.
టీకా:
వాసవవర్ధకి = త్వష్ట
{వాసవవర్ధకి - విశ్వకర్మ,
దేవతాశిల్పి,
త్వష్ట}; వాడిగాజఱచిన = పదునుపెట్టిన;
కుద్దాల = తవ్వుగోలల;
ముఖములన్ = మొనలతో;
కొంతన్ = కొంచము;
త్రవ్వి = తవ్వి;
ముసల = రోకండ్ల;
అగ్రములన్ = కొనలను;
చొన్పి = దూర్చి;
మొదలిపాన్ = మొదలంటా;
తగిలించి = తగిలించి;
దీర్ఘ = పొడవైన;
పాశంబులన్ = తాళ్ళను;
ద్రిండు = దిండుగా;
చుట్టి = చుట్టి;
పెకలించి = పెళ్ళగించి;
బాహులన్ = చేతులతో;
పీడించి =
గట్టిగాపట్టి;
కదిలించి = కదిపి;
పెల్లు = గట్టిగా;
అర్చి = అరచి;
తమతమ =
వారివారి; పేరు = పౌరుషములను;
వాడి = ప్రకటించుచు;
పెఱికి = పీకి;
మీది = పై; కిన్ = కి; ఎత్తి = ఎత్తి;
పృథుల = పెద్దపెద్ద;
హస్తంబులన్ = చేతులతో;
తలలన్ =
తలలకి; భుజంబులన్ = భుజములకు;
తరలకుండన్ = జారకుండగ;
ఆని = ఆన్చి.
మెల్లన్ = మెల్లగా;
కుఱు = చిన్నచిన్నగా;
తప్పుడు = అతిక్రమించెడు;
అడుగులు = అడుగులు;
ఇడుచున్ =
వేయుచు; భారము = బరువు;
అధికంబు = చాలా ఎక్కువ;
మఱవక = మరచిపోకుండ;
పట్టుడు =
పట్టుకొనుడు;
అనుచున్ = అంటూ;
మందర = మందర యనెడి;
నగంబున్ = పర్వతమును;
తెచ్చిరి = తీసుకువచ్చిరి;
అమంద = చురుకైన;
గతిన్ = విధముగా;
దేవ = దేవతలు;
దైత్యులు =
రాక్షసులు; జలరాశి = సముద్రము;
తెరువుపట్టి = వైపునకు.
భావము:
దేవతాశిల్పి అయిన త్వష్ట పదునుపెట్టిన త్రవ్వుగోలలతో, దేవదానవులు మంథర పర్వతాన్ని కొంత త్రవ్వారు; రోకళ్ళను క్రిందకి చొప్పించారు. పొడుగుపాటి త్రాళ్ళతో బిగించి కట్టారు.
చేతుల బలంకొద్దీ ఆ కొండను మెల్లగా రోకళ్ళతో
కుళ్ళగించి,
కదిలించి, తమ తమ బిరుదులు వాడుతూ గట్టిగా కేకలు వేస్తూ, పెరికి పెల్లగించి పైకెత్తారు. బలమైన తమ చేతులతోటీ, తలలతోటీ, భుజాలతోటీ జారకుండా కాసుకుంటూ కొండను ఎత్తుకున్నారు. మెల్లగా తప్పటడగులు వేయసాగారు. అలాగే “బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి” అంటూ చురుకుగా మందర అనే ఆ కొండను సముద్రం
వైపునకు మోసుకుంటూ తీసుకొచ్చారు.
८-१८३-सी.
वासव वर्धकि
वाँडिगाँ जर्रचिन;
कुद्दालमुखमुलँ
गोंत द्रव्वि
मुसलाग्रमुल जोन्पि
मोदलि पाँ तगलिंचि;
दीर्घ पाशंबुलँ
द्रिंडु चुट्टि
पेकलिंचि बाहुल
बीडिंचि कदलिंचि;
पेल्लार्चि तमतम
पेरु वाडि
पेर्रिकि मीँदिकि
नेत्ति पृथुल हस्तंबुलँ;
दलल भुजंबुलँ
दरलकुंड
८-१८३.१-ते.
नानि मेल्लन
कुर्रुतप्पुटडुगु लिडुचु
भार मधिकंबु मर्रवक
पट्टुँ डनुचु
मंदरनगंबुँ देच्चि
रमंदगतिनि.
देव दैत्युलु
जलराशि तेरुवु पट्टि.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment