8-171-క.
ఓ! నలువ! యో! సురేశ్వర!
యో! నిటలతటాక్ష!
యో! సురోత్తములారా!
దానవులతోడ నిప్పుడు
మానుగ బోరామి గలిగి మనుటే యొప్పున్.
టీకా:
ఓ = ఓ; నలువ =
బ్రహ్మదేవుడా {నలువ - నలు (నాలుగు) వా (మోములుగలవాడు),
బ్రహ్మ}; ఓ = ఓ; సురేశ్వర = ఇంద్ర {సురేశ్వర - సురలకు ఈశ్వరుడు,
ఇంద్రుడు}; ఓ = ఓ; నిటలతాక్ష = పరమశివ
{నిటలతలాక్షుడు - నిటలతల (నుదట) అక్షుడు
(కన్నుగలవాడు) శివుడు}; ఓ = ఓ; సుర =
దేవతలలో; ఉత్తములారా = ఉత్తములు;
దానవుల్ = రాక్షసుల;
తోడన్ = తోటి;
ఇప్పుడు =
ఇప్పుడు; మానుగ = మనోజ్ఞముగ;
పోరామి = నిర్యుద్దసంధి;
కలిగి = కలిగి;
మనుటే =
బతుకుటయే; ఒప్పున్ = సరియైనపని.
భావము:
“ఓ చతుర్ముఖ బ్రహ్మ దేవుడా! ఓ దేవతలకు ప్రభువు అయిన దేవేంద్రుడా!
నుదుటి కన్నుగల ఓ త్రినేత్రుడా రుద్రుడా! ఓ దేవతాముఖ్యులారా!
ప్రస్తుతం మీరు రాక్షసులతో మంచిగా ఉండి, స్నేహం చేసి జీవించడమే మంచిది.
८-१७१-क.
ओ! नलुव! यो!
सुरेश्वर!
यो! निटलतटाक्ष!
यो! सुरोत्तमुलारा!
दानवुलतोड निप्पुडु
मानुग बोरामि गलिगि
मनुटे योप्पुन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment