Wednesday, June 1, 2016

క్షీరసాగరమథనం - ఈ రీతిం

విష్ణుని అనుగ్రహవచనము
8-170-శా.
 రీతిం జతురాననాది నుతుఁడై యేపార జీమూత గం
భీరంబైన రవంబునం బలికె సంప్రీతాత్ముఁడై యీశ్వరుం
డా రోమాంచిత కాయులన్ నవవిముక్తాపాయులం బ్రేయులం
బ్రాబ్ధోగ్ర మహార్ణవోన్మథన వాంఛానల్పులన్ వేల్పులన్.
టీకా:
            ఈ = ఈ; రీతిన్ = విధముగ; చతురానన = చతుర్ముఖబ్రహ్మ {చతురానననుడు - చతుర్ (నాలుగు, 4) ఆనననుడు (ముఖములుగలవాడు), బ్రహ్మ}; ఆది = మొదలగువారిచే; నుతుడు = స్తుతింపబడినవాడు; ఐ = అయ్యి; ఏపారన్ = అతిశయించగా; జీమూత = మేఘమువంటి; గంభీరంబు = గంభీరము; ఐన = అయిన; రవంబునన్ = స్వరముతో; పలికెన్ = అనెను; సంప్రీత = సంతోషించిన; ఆత్ముడు = మనసుగలవాడు; ఐ = అయ్యి; ఈశ్వరుండు = భగవంతుడు; ఆ = ఆ; రోమాంచిత = పులకించిన; కాయులన్ = దేహముగలవారిని; నవ = అప్పుడే; విముక్తా = వదలిన; అపాయులన్ = కష్టములుగలవారిని; ప్రేయులన్ = ప్రేమపాత్రులను; ప్రారబ్ద = ప్రారబ్దము యనెడి; ఉగ్ర = భయంకరమైన; మహా = గొప్ప; ఆర్ణవ = సముద్రమును; మథన = చిలుకెడి; వాంఛ = కోరెడి; అనల్పులన్ = గొప్పవారిని; వేల్పువన్ = దేవతలను.
భావము:
            అలా బ్రహ్మదేవ ప్రముఖులు ప్రార్థించగా భగవంతుడు సంతోషించాడు. దేవతల దేహాలు నిలువెల్ల పులకించాయి. అప్పుడే తమ కష్టాలనుండి గట్టెక్కినట్లు తలచారు. భయంకరమైన ప్రారబ్దమనే సముద్రాన్ని మథించడానికి ఉత్సాహపడ్డారు. అప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి మేఘ గంభీరమైన సంఠస్వరంతో ఇలా అన్నాడు.
८-१७०-शा.
ई रीतिं जतुराननादि नुतुँडै येपार जीमूत गं
भीरंबैन रवंबुनं बलिके संप्रीतात्मुँडै यीश्वरुं
डा रोमांचित कायुलन् नवविमुक्तापायुलं ब्रेयुलं
ब्रारब्धोग्र महार्णवोन्मथन वांछानल्पुलन् वेल्पुलन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: