Monday, June 20, 2016

క్షీరసాగరమథనం – విడు విడుఁ డని

8-199-క.
విడు విడుఁ డని ఫణి పలుకఁగఁ
డుభరమున మొదలఁ గుదురు లుగమి గెడఁవై
బుబుడ రవమున నఖిలము
వడ వడఁకఁగ మహాద్రి నధి మునింగెన్.
8-200-ఉ.
గౌవమైన భారమునఁ వ్వపుఁగొండ ధరింప లేక దో
స్సా విహీనులై యుభయ సైనికులుం గడు సిగ్గుతో నకూ
పాతటంబునం బడిరి పౌరుషముం జెడి పాండవేయ! యె
వ్వారికి నేరఁబోలు బలవంతపు దైవము నాక్రమింపగన్?
టీకా:
          విడు = విడిచిపెట్టండి; విడుడు = విడిచిపెట్టండి; అని = అని; ఫణి = సర్పము; పలుకగన్ = అరుచుచుండగ; కడు = అధికమైన; భరమునన్ = బరువువలన; మొదలన్ = క్రింద; కుదురు = కుదురు {కుదురు - కుదురుగా నిలుచుటకు ఏర్పరచెడి పీఠము}; కలుగమి = లేకపోవుటచేత; కెడవు = ఒరిగినది; ఐ = అయ్యి; బుడబుడ = బుడబుడ యనెడి; రవమునన్ = శబ్దముతో; అఖిలమున్ = సర్వము; వడవడ = వడవడ యని; వడకగన్ = వణికిపోగా; మహా = గొప్ప; అద్రి = కొండ; వనధిన్ = సముద్రమునందు; మునింగెన్ = మునిగినది.
          గౌరవమైన = గొప్పదైన; భారమునన్ = బరువువలన; కవ్వపు = కవ్వముగానున్న {కవ్వము - పెరుగు చిలికెడు సాధనము}; కొండన్ = కొండను; ధరింపన్ = భరించ; లేక = లేక; దోః = భుజ; సార = బలము; విహీనులు = లేనివారు; ఐ = అయ్యి; ఉభయ = రెండు (2) పక్షముల; సైనికులున్ = భటులును; కడు = మిక్కలి; సిగ్గు = అవమానము; తోనన్ = తోటి; అకూపార = సముద్రపు; తటంబునన్ = ఒడ్డున; పడిరి = కూలబడిరి; పౌరుషము = పరాక్రమములు; చెడి = కోల్పోయి; పాండవేయ = పరీక్షితా {పాండవేయుడు - పాండవవంశస్తుడు, పరీక్షిత్తు}; ఎవ్వారి = ఎలాంటివారి; కిన్ = కైనను; నేరన్ = సాధ్యము; పోలు = కానిది; బలవంతపు = ప్రబలమైన; దైవమున్ = విధిని; ఆక్రమింపన్ = దాటుటకు.
భావము:
            అమృతమథన సమయంలో వాసుకి “వదలండి వదలండి” అన్నాడు. మందర పర్వతం అడుగున కుదురు లేకపోడంతో అధిక బరువు వలన పడిపోతూ సముద్రంలో “బుడ బుడ” మని మునిగింది. దేవ రాక్షస సమూహం సమస్తం “వడ వడ” మని వణికింది.
            ఓ పాండవవంశపు పరీక్షిత్తు! దాని అధికమైన బరువు వలన కవ్వంకొండగా ఉన్న ఆ మందర పర్వతాన్ని మళ్ళీ పైకి దేవరాక్షస శూరులు ఎత్తలేకపోయారు. తమ భుజబలాలు కోల్పాయారు. ఎంతో సిగ్గుపడ్డారు. పరాక్రమాలు కోల్పోయి సముద్రం ఒడ్డున నిలబడి తెగ బాధపడసాగారు. అవును, ఎంతటి వారికైనా ప్రబలమైన విధిని దాటడం సాధ్యం కాదు కదా!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: