Friday, June 3, 2016

క్షీరసాగరమథనం – ఎప్పుడు

8-172-వ.
అది యెట్లంటి రేని.
8-173-క.
ప్పుడు దనకును సత్త్వము
చొప్పడు నందాఁక రిపులఁ జూచియుఁ దనమైఁ
ప్పికొని యుండవలయును
నొప్పుగ నహి మూషకమున కొదిఁగిన భంగిన్.
టీకా:
            అది = అలా; ఎట్లు = ఎలా; అంటిరి = అనిన; ఏని = చో.
            ఎప్పుడు = ఎప్పుడైతే; తన = తన; కును = కు; సత్త్వము = బలము; చొప్పడున్ = సమకూరుతుందో; అంత = అప్పటి; దాక = వరకు; రిపులన్ = శత్రువులను; చూచియున్ = చూసినప్పటికిని; తన = తను; మైగప్పికొని = ఒదిగి {మైగప్పికొని - మేను దాచుకొని, ఒదిగి}; ఉండవలయును = ఉండవలెను; ఒప్పుగ = చక్కగా; అహి = పాము; మూషకమున్ = ఎలుక; కున్ = కోసము; ఒదిగిన = ముడుచుకొనియుండు; భంగిన్ = విధముగ.
భావము:
            అది ఎలాగంటే.
            ఎలుకకోసం పాము పొంచి ఉండే విధంగా, బలం చేకూరేదాకా సమయంకోసం నిరీక్షిస్తూ శత్రువుల బారినుండి శరీరాన్ని దాచుకుని ఉండటం ఉత్తముల లక్షణం.
८-१७२-व.
अदि येट्लंटि रेनि.
८-१७३-क.
एप्पुडु दनकुनु सत्त्वमु
चोप्पडु नंदाँक रिपुलँ जूचियुँ दनमैँ
गप्पिकोनि युंडवलयुनु
नोप्पुग नहि मूषकमुन कोदिँगिन भंगिन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: