Wednesday, June 8, 2016

క్షీరసాగరమథనం – పస చెడి

8-179-క.
 చెడి తనకును వశమై
సురముతో గొల్చుచున్న సురసంఘములన్
సిమసిఁగి చంపఁ బూనిన
సురుల వారించె బలియు తినయయుక్తిన్.
టీకా:
            పసచెడి = బలహీనులై; తన = తన; కునున్ = కు; వశము = లొంగినవాడు; ఐ = అయ్యి; సుసరము = మంచినడత; తోన్ = తోటి; కొల్చుచున్న = సేవించుచున్న; సుర = దేవతా; సంఘములన్ = సమూహములను; కసిమసిగి = విజృంభించి; చంపన్ = సంహరించ; పూనిన = సిద్దబడిన; అసురులన్ = రాక్షసులను {అసురులు - సుర (అమృతము) లేనివారు, రాక్షసులు}; వారించెన్ = ఆపెను; బలియున్ = బలి; అతి = మిక్కలి; నయ = చక్కటి; యుక్తిన్ = నేర్పుతో.
భావము:
            మంచి మనసుతో తనను సేవిస్తున్న బలహీనులైన దేవతలను, కక్షగట్టి చంపేయాలి అనుకుంటున్న తన వారైన రాక్షసులను బలిచక్రవర్తి ఎంతో నేర్పుతో చంపవద్దని వారించాడు.
८-१७९-क.
पस चेडि तनकुनु वशमै
सुसरमुतो गोल्चुचुन्न सुरसंघमुलन्
गसिमसिँगि चंपँ बूनिन
नसुरुल वारिंचे बलियु नतिनययुक्तिन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: