8-185-క.
ఏలా హరికడ కేఁగితి?
మేలా దొరఁకొంటి మధిక హేలన శైలో
న్మూలనము జేసి తెచ్చితి?
మేలా పెక్కండ్రు మడిసి రేలా నడుమన్?
8-186-క.
ఏటికి మముఁ బని బంచెను?
నేటికి మనఁ బోఁటివారి కింతలు పను?
లిం
కేటికి రాఁడు రమేశ్వరుఁ?
డేటి కుపేక్షించె? మఱవ నేటికి మనలన్?
టీకా:
ఏలా = ఎందుకు;
హరి =
విష్ణుని; కడ = దగ్గర;
కున్ = కు; ఏగితిమి = వెళ్ళతిమి;
ఏలా = ఎందుకు;
దొరకొంటిమి = పూనుకొంటిమి;
అధిక = మిక్కలి;
హేలనన్ = మైకముతో;
శైల = కొండను;
ఉన్మూలనము = పెకలించుట;
చేసి = చేసి;
తెచ్చితిమి = తీసుకొచ్చితిమి;
ఏలా = ఎలాగా;
పెక్కండ్రు = అనేకమంది;
మడిసిరి = చనిపోయిరి;
ఏలా = ఎలాగా;
నడుమన్ = మధ్యలో.
ఏటి = ఎందుల;
కిన్ =
కు; మమున్ = మమ్ములను;
పనిపంచెను = నియోగించెను;
ఏటి = ఎందు;
కిన్ = కు; మన =
తమ; పోటి = వంటి;
వారి = వారల;
కిన్ = కి; ఇంతలు = ఇంతపెద్ద;
పనులు = కార్యములు;
ఇంకన్ = ఇంకను;
ఏటి = ఎందు;
కిన్ = కు; రాడు = రావడంలేదు;
రమేశ్వరుడు = విష్ణువు
{రమేశ్వరుడు - రమ (లక్ష్మీదేవికి)
ఈశ్వరుడు (పతి), విష్ణువు};
ఏటి = ఎందుల;
కున్ = కు; ఉపేక్షించెన్ = నిర్లక్ష్యముచేసెను;
మఱవన్ = మరచిపోవుట;
ఏటి = ఎందు;
కిన్ = కు; మనలన్ = మనలను.
భావము:
“విష్ణువు దగ్గరకి ఎందుకు వెళ్ళాం? మత్తెక్కినట్లు ఈ పనికి ఎందుకు పూనుకున్నాం? ఈ మంథర పర్వతాన్ని కోరి పెకలించుకుని తెచ్చాం? ఎంచేత ఈ మధ్యలో పడి చనిపోయారు?
ఇలాంటి పని భగవంతుడు ఎందుకు అప్పజెప్పాడు? మనలాంటి వారు ఇలాంటి పనులు చేపట్టి చేయగలరా? ఆ లక్ష్మీపతి అయిన విష్ణువు సహాయంచేయటానికి ఇంకా ఎంచేత
రావటం లేదో?
ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో? మనకు సాయం రాకుండా ఇలా ఎందుకు మరచిపోయాడో?”
८-१८५-क.
एला हरिकड केँगिति?
मेला दोरँकोंटि
मधिक हेलन शैलो
न्मूलनमु जेसि
तेच्चिति?
मेला पेक्कंड्रु
मडिसि रेला नडुमन्?
८-१८६-क.
एटिकि ममुँ बनि
बंचेनु?
नेटिकि मनँ
बोँटिवारि किंतलु पनु? लिं
केटिकि राँडु
रमेश्वरुँ?
डेटि कुपेक्षिंचे?
मर्रव नेटिकि मनलन्?
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment