Sunday, June 12, 2016

క్షీరసాగరమథనం – మందరము

8-184-క.
మంరము మోవ నోపమి
నంఱపైఁబడియె నదియు తిచోద్యముగాఁ
గొంఱు నేలం గలిసిరి
కొంఱు నుగ్గయిరి; చనిరి కొందఱు భీతిన్.
టీకా:
            మందరమున్ = మందరపర్వతమును; మోవన్ = మోయ; ఓపమిన్ = లేకపోవుటచేత; అందఱ = అందరి; పైన్ = మీదను; పడియెన్ = పడినది; అదియున్ = అది; అతి = మిక్కలి; చోద్యముగాన్ = విచిత్రముగా; కొందఱున్ = కొంతమంది; నేలన్ = మట్టిలో; కలిసిరి = కలిసిపోయిరి; కొందఱున్ = కొంతమంది; నుగ్గయిరి = నలిగిపోయిరి; చనిరి = పారిపోయిరి; కొందఱున్ = కొంతమంది; భీతిన్ = భయమువలన.
భావము:
            మందరపర్వతాన్ని మోయడానికి దేవదానవులకు శక్తి సరిపోలేదు. ఆశ్చర్యకరంగా అది ఒరిగి నేలమీద పడిపోయింది. అప్పుడు కొందరు మరణించారు. కొందరు నలిగిపోయారు. మరి కొందరు పారిపోయారు.
८-१८४-क.
मंदरमु मोव नोपमि
नंदर्रपैँबडिये नदियु नतिचोद्यमुगाँ;
गोंदर्रु नेलं गलिसिरि
कोंदर्रु नुग्गयिरि; चनिरि कोंदर्रु भीतिन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: