Friday, June 24, 2016

క్షీరసాగరమథనం – తరిగాండ్రలోన

8-204-వ.
ఇవ్విధంబున.
8-205-క.
రిగాండ్రలోన నొకఁడట
రి గడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్
రి గవ్వంబును దా నఁట
రిహరి! హరిచిత్రలీల రియే యెఱుఁగున్.
టీకా:
            ఈ = ఈ; విధంబునన్ = విధముగా.
            తరిగాండ్ర = చిలికెడివారి; లోనన్ = లోపల; ఒకడు = ఒకడు; అటన్ = అక్కడ; తరిగడవ = మజ్జిగకుండైనసముద్రము; కున్ = అందలి; కుదురున్ = కుదురు; నాక = సర్పపు; త్రాడు = తాడు; అటన్ = అక్కడ; చేరుల్ = చేరినవారు; తరి = చిలికెడి; కవ్వంబున్ = కవ్వము; తాన్ = తనే; అటన్ = అట; హరిహరి = ఆహా; హరి = విష్ణుని; చిత్ర = విచిత్రమైన; లీలన్ = లీలలను; హరియే = విష్ణువునకే; యెఱుగున్ = తెలియును.
భావము:
            ఇలా మందర పర్వతాన్ని ఎత్తి. . .
            ఆహా! ఎంతటి విచిత్రమైన విష్ణులీలలు? సముద్రాన్ని చిలికేవారిలో ఒకడిగా ఉన్నాడట, పాల సముద్రం అనే పెరుగుకుండకు కుదురు తానేనట, చిలికే కవ్వంగా ఉన్న మందరపర్వంతం, కవ్వానికి కట్టిన చిలుకుతాడుగా ఉన్న మహానాగుడు వాసుకి తానేనట. ఆహా! విష్ణువు లీలలు విష్ణువుకే తెలుసు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: