Monday, October 31, 2016

వామన వైభవము : జనకుం డెవ్వడు

8-475-మ.
"కుం డెవ్వడు? జాతుఁ డెవ్వఁడు? జనిస్థానంబు లెచ్చోటు? సం
నం బెయ్యది? మేను లేకొలఁదిఁ? సంసారంబు లేరూపముల్
వినుమా యింతయు విష్ణుమాయ దలఁపన్వేఱేమియున్ లేదు; మో 
 నిబంధంబు నిదాన మింతటికి జాయా! విన్నఁబో నేటికిన్?
8-476-వ.
అగు నయిననుం గాలోచిత కార్యంబు చెప్పెద.

టీకా:
          జనకుండు = తండ్రి; ఎవ్వడు = ఎవరు; జాతుడు = పుత్రుడు; ఎవ్వడు = ఎవరు; జని = జన్మ; స్థానంబులు = స్థలములు; ఎచ్చోటు = ఏవి; సంజననంబు = పుట్టుక; ఎయ్యది = ఎట్టిది; మేనులు = జీవములు; ఏకొలది = ఎన్ని ఉన్నవి; సంసారంబుల్ = సంసారములు; ఏ = ఎట్టి; రూపముల్ = స్వరూపముకలవి; వినుమా = వినుము; ఇంతయున్ = ఇదంతా; విష్ణు = విష్ణుమూర్తియొక్క; మాయ = మాయ; తలపన్ = తరచిచూసినచో; వేఱు = ఇంక, ఇతరము; ఏమియున్ = ఏమీ; లేదు = లేదు; మోహ = మాయయందు; నిబంధంబు = తగులుకొనుట; నిదానము = మూలకారణము; ఇంతటి = దీనంతటి; కిన్ = కి; జాయా = ఇల్లాలా; విన్నబోన్ = చిన్నపుచ్చుకొనుట; ఏటికిన్ = ఎందుకు.
          అగునయిననున్ = అలా అయినప్పటికిని; కాల = కాలముకు; ఉచిత = తగినట్టి; కార్యంబున్ = పనిని; చెప్పెద = తెలిపెదను.

భావము:
            ఇల్లాలా! తండ్రి ఎవడు? కొడుకు ఎవడు? పుట్టిన స్ధలాలు ఏవి? పుట్టుకకు కారణము ఏమిటి? శరీరాలు ఏపాటివి? ఈ సంసారాలు ఏమాత్రమైనవి? ఆలోచిస్తే ఇదంతా భగవంతుడైన ఆ విష్ణుమూర్తి మాయ తప్ప మరేమీ కాదు. అజ్ఞానంలో బంధింపబడి ఉండడమె. దీనికి మూలం. అందువల్ల జరిగిన దానికి చింతించి చిన్నబుచ్చుకోకు.
            సరే, ప్రస్తుతానికి తగిన కార్యాన్ని చెబుతాను విను.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, October 30, 2016

వామన వైభవము : ప్రజలకు

8-472-క.
ప్రలకు నెల్లను సముఁడవు 
ప్రలను గడుపారఁ గన్న బ్రహ్మవు నయ్యుం
బ్రలందు దుష్టమతులను
నిముగ శిక్షింప వలదె నీవు? మహాత్మా!
8-473-మ.
సులన్ సభ్యుల నార్తులన్ విరథులన్ శోకంబు వారించి ని
ర్జధానిన్ నిలుపంగ రాత్రిచరులన్ శాసింప సత్కార్య మే
వె వేరీతి ఘటిల్లు నట్టి క్రమమున్ వేగంబ చింతింపవే
రుణాలోక సుధాఝరిం దనుపవేళ్యాణ సంధాయకా! "
8-474-వ.
అనిన మనోవల్లభ పలుకు లాకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞానదృష్టి నవలంబించి భావికాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ యిట్లనియె.

టీకా:
          ప్రజలన్ = సంతానమునకు; ఎల్లను = అందరిపట్లను; సముడవు = సమానంగచూచువాడవు; ప్రజలను = సంతానమును; కడుపారన్ = కడుపునిండుగా; కన్న = పుట్టించినట్టి; బ్రహ్మవు = ప్రజాపతివి; అయ్యున్ = అగుటచేత; ప్రజల్ = పిల్లల; అందున్ = లో; దుష్ట = చెడు; మతులను = బుద్దులుగలవారిని; నిజముగన్ = తప్పక; శిక్షింపవలదె = శిక్షించవలెనుకదా; నీవు = నీవు; మహాత్మా = గొప్పవాడా.
          సురలన్ = దేవతలను; సభ్యులన్ = మర్యాదస్తులను; ఆర్తులన్ = దుఃఖితులను; విరథులన్ = ఓడిపోయినవారిని; శోకంబున్ = దుఃఖమును; వారించి = పోగొట్టి; నిర్జరధాని = అమరావతియందు {నిర్జరధాని -దేవతలరాజధాని, అమరావతి}; నిలుపంగ = నిలబెట్టుటకు; రాత్రిచరులన్ = రాక్షసులను; శాసింపన్ = శిక్షించుట; సత్కార్యము = మంచిపని; ఈ = ఈలాగు; వెరవు = ఆవటము; ఏరీతిన్ = ఏవిధముగ; ఘటిల్లున్ = నెరవేరుతుందో; అట్టి = అటువంటి; క్రమమును = పద్దతిని; వేగంబ = శ్రీఘ్రమే; చింతింపవే = ఆలోచించుము; కరుణ = దయకల; ఆలోక = చూపులు యనెడి; సుధా = అమృతపు; ఝరిన్ = ప్రవాహమునందు; తనుపవే = ముంచెత్తుము; కల్యాణ = శుభములను; సంధాయికా = కలిగించెడివాడ.
          అనినన్ = అనగా; మనోవల్లభ = భార్య {మనోవల్లభ - మనసునకు వల్లభ (నాయిక), సతి}; పలుకుల్ = మాటలు; ఆకర్ణించి = విని; ముహూర్తమాత్రంబు = కొంచముసేపు; చింతించి = ఆలోచించి; విజ్ఞానదృష్టిన్ = దివ్యదృష్టిని; అవలంభించి = సారించి; భావి = రాబోవు; కాల = కాలము; కార్యంబున్ = సంగతులు; విచారించి = ఆలోచించి; కశ్యప = కశ్యపుడు యనెడి; బ్రహ్మ = ప్రజాపతి; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను.

భావము:
            మహాత్మా! కశ్యపా! బిడ్డలు అందరి ఎడలా నీవు సమానమైన వాడవు. ప్రేమతో బిడ్డలను కన్న ప్రజాపతివి కాబట్టి, నీవు దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండించాలి కదా.
            మహానుభావా! సకల కల్యాణాలను సమకూర్చే వాడవు నీవు. ఉత్తములైన దేవతలు కష్టాలకు గురయ్యారు. భాగ్యాలు కోల్పోయారు. వారి దుఃఖాన్ని తొలగించు. వారిని అమరావతిలో నెలకొల్పడమూ, రాక్షసులను శిక్షించడమూ చేయవలసిన మంచిపని. తొందరగా ఆలోచించి ఈ కార్యం ఏ విధంగా నెరవేరుతుందో చూడు. మమ్మల్ని నీ కరుణారస ప్రవాహంలో ముంచెత్తు."
ఇలా అంటున్న తన ప్రియ భార్య మాటలు విని, కశ్యపప్రజాపతి కొంచెంసేపు ఆలోచించాడు. జ్ఞానదృష్టితో రాబోయే కాలంలో జరగబోయే సంగతులు తెలుసుకుని ఇలా అన్నాడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, October 29, 2016

వామన వైభవము : అక్కా చెల్లెండ్రయ్యును

8-470-క.
క్కా చెల్లెండ్రయ్యును
క్కరు నాతోడి పోరుఁదానున్ దితియున్
క్కసులు సురల మొత్తఁగ
క్కట! వల దనదు చూచు నౌనౌ ననుచున్.
8-471-సీ.
ఎండకన్నెఱుగని యింద్రుని యిల్లాలు
లుపంచలను జాలిఁ డియె నేఁడు 
త్రిభువన సామ్రాజ్య విభవంబుఁ గోల్పోయి
దేవేంద్రుఁ డడవులఁ దిరిఁగె నేఁడు
లిమి గారాబు బిడ్డలు జయంతాదులు
బరార్భకుల వెంటఁ నిరి నేఁడు
మరుల కాధారగు నమరావతి
సురుల కాటపట్టయ్యె నేఁడు
8-471.1-ఆ.
లి జగముల నెల్ల లియుచు నున్నాఁడు
వాని గెలువరాదు వాసవునకు
యాగభాగమెల్ల తఁ డాహరించుచుఁ
డఁగి సురల కొక్క డియుఁ నీఁడు.

టీకా:
          అక్కచెల్లెండ్రు = అక్కాచెల్లెళ్ళము; అయ్యున్ = అయినప్పటికిని; తక్కరు = వదలిపెట్టరు; నా = నా; తోడి = తోటి; పోరున్ = దెబ్బలాటలను; తానున్ = ఆమె; దితియున్ = దితికూడ; రక్కసులు = రాక్షుసులు; సురలన్ = దేవతలను; మొత్తగన్ = కొడుతుండగ; అక్కట = అయ్యో; వలదు = వద్దు; అనదు = అనిచెప్పదు; చూచున్ = చూచుచుండును; ఔనౌను = భళీభళీ; అనుచున్ = అనుచు.
          ఎండకన్నెఱుగని = అతిసుకుమారియైన {ఎండకన్నెఱుగని - ఎండ (సూర్యకిరణముల) కన్ను (చూపునుకూడ) ఎఱుగని (తెలియని), మిక్కలి సుకుమారమైన}; ఇంద్రుని = ఇంద్రుని యొక్క; ఇల్లాలు = భార్య; పలు = అనేకుల; పంచలను = చూర్లుయందు {పంచలు - పంచత్వములు, చావులు}; జాలిబడియె = దీనత్వమునపడెను; నేడు = ఇవాళ; త్రిభువన = ముల్లోకముల; సామ్రాజ్య = మహారాజ్యాధికార; విభవంబున్ = వైభవమును; కోల్పోయి = నష్టపోయి; దేవేంద్రుడు = ఇంద్రుడు; అడవులన్ = అడవులమ్మట; తిరిగెన్ = తిరుగుచున్నాడు; నేడు = ఇవాళ; కలిమి = సంపదలకు; గారాబు = గారాల; బిడ్డలు = పిల్లలు; జయంత = జయంతుడు; ఆదులు = మున్నగువారు; శబర = బోయల; అర్భకుల = పిల్లల; వెంటన్ = తోకూడ; చనిరి = వెళ్ళుచున్నారు; నేడున్ = ఇవాళ; అమరుల్ = దేవతల; కున్ = కు; ఆధారము = నెలవైనది; అగు = అయిన; అమరావతి = అమరావతీపట్టణము; అసురుల్ = రాక్షసుల; కున్ = కు; ఆటపట్టు = అలవాలము; అయ్యెన్ = అయినది; నేడు = ఇవాళ. 
          బలి = బలి; జగములన్ = లోకములను; ఎల్లన్ = అన్నిటియందు; బలియుచున్ = బలవంతుడు అగుచు; ఉన్నాడు = ఉన్నాడు; వానిన్ = అతనిని; గెలువరాదు = జయింపశక్యముకాదు; వాసవున్ = ఇంద్రున {వాసవుడు - వసువులు (రత్నములు) కలవాడు, ఇంద్రుడు}; కున్ = కు; యాగభాగము = హవిర్భాగములను; ఎల్లన్ = అంతటిని; అతడు = అతడే; ఆహరించుచున్ = దోచేసుకొనుచు; కడగి = పూని; సురల్ = దేవతల; కున్ = కు; ఒక్క = ఒక; కడియున్ = ముద్దకూడ; ఈడు = ఇవ్వడు.

భావము:
            దితీ నేనూ అక్క చెల్లెళ్ళమే. అయినప్పటికీ ఆమె నాతో ఎప్పుడూ కలహిస్తూనే ఉంటుంది. దేవతలను ఆమె పిల్లలు రాక్షసులు బాధపెడుతున్నా ఆమె మెచ్చుకుంటుందే కాని వద్దని అనదు.
            ఎండకన్నెరగని ఇంద్రుని ఇల్లాలు శచీదేవి ఈనాడు పలు కష్టాలకు గురై బాధపడుతూ ఉంది. ఇంద్రుడు ముల్లోకాల రాజ్యసంపదనూ పోగొట్టుకొని ఈనాడు అడవులలో ఇడుములు పడుతున్నాడు. కలవారిబిడ్డలై అల్లారు ముద్దుగా పెరిగిన జయంతాదులు ఈనాడు బోయపిల్లల వెంట తిరుగుతున్నారు. దేవతల నెలవైన అమరావతి ఈనాడు రాక్షసులకు అలవాలమైనది. అన్ని లోకాలలోనూ బలి బలవంతుడు అవుతున్నాడు. అతనిని ఇంద్రుడు నిలువరించలేక పోతున్నాడు. యజ్ఞాలలో హవిర్భాగాలన్నింటినీ బలి దోచుకుంటున్నాడు ఒక్క కబళంకూడా దేవతలకు చిక్కనివ్వడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :