హరికిం
1-11-మ.
హరికిం బట్టపుదేవి, పున్నెముల
ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ
గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా
మరలందుండెడిముద్దరాలు, జగముల్ మన్నించునిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.
గ్రంథారంభ లక్ష్మీదేవి స్తోత్రం –
దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి; రాశి పోసిన పుణ్యాలు
రూపుగట్టిన పుణ్యవతి; సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు; వాణితోను
కల్యాణితోను క్రీడించే పూబోడి; అరవింద మందిరంగా గల జవరాలు; అఖిలలోకాలకు
ఆరాధ్యురాలైన అన్నులమిన్న; చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు
తల్లి; ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రహించు గాక.
1-11-ma.
harikiM
baTTapudaevi, punnemula prO varthaMpu@M bennikka, chaM
duru
tO@MbuTTuvu, bhaaratee girisutal tO naaDu poo@MbO@MDi, taa
maralaMduMDeDimuddaraalu,
jagamul manniMchunillaalu, bhaa
suratan
laemulu vaapu talli, siri yichchun nityakalyaaNamul.
హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; పట్టపు = పట్టపు; దేవి = రాణి; పున్నెముల = పుణ్యముల; ప్రోవు = పోగు; అర్థంపు = సంపదలకు; పెన్ = పెద్ద; ఇక్క = నిలయము; చందురు = చంద్రుడికి; తోన్ = తో కలిసి - తోడ; పుట్టువు = పుట్టినది; భారతీ = సరస్వతి; గిరిసుతల్ = పర్వత పుత్రిల (పార్వతి); తోన్ = తో కలిసి; ఆడు = ఆడే; పూఁన్ = పూవును; పోడి = పోలినది - స్త్రీ; తామరలు = పద్మముల; అందున్ = లో; ఉండెడి = ఉండే; ముద్దు = మనోజ్ఞముగ ఉన్న; ఆలు = స్త్రీ; జగముల్ = లోకాలు; మన్నించు = గౌరవించే; ఇల్లు = గృహమునకు; ఆలు = స్త్రీ; భాసురతన్ = (తన) ప్రకాశము వలన; లేములు = దరిద్రాలను; వాపు = పోగొట్టే; తల్లి = అమ్మ; సిరి = లక్ష్మి; ఇచ్చున్ = ఇచ్చుగాక; నిత్య = నిత్యమైన; కల్యాణముల్ = శుభములు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
3 comments:
VS Rao Gaariki Namaskaram.
Ayya,
Pothana gaari Bhagavatham gurinchi, Enno rojulu vethikaka,
suddenga okaroju mi site dhorikindhi. Entho
santhoshamesindhi. Intha manchi site chesthunnanduku, meeku
dhanyavadalu.. Enni cheppina avi saripodhani thelusu.
Appatinunchi, kavalisinappualla chaduvuthuntaanu. Roju meeru
oka padyam blog lo cheppadam bagundhi. Telugu sahithyam lo
asalu emi thelidhu naaku, Kaani ardham tho paatu, a padala
koorpu ni kuda ardham chesukodaaniki aduguthunnanu. prathi
line lo chivaraga oka aksharanni underline chesthunnaru.
Dhani ardham enti. Dhaya chesi cheppagalaru.
Dhanyavadalu,
Kavitha
నమస్తే కవితగారు.
మీ ఆదరపూర్వక అభిమానానికి, చక్కటి స్పందనకి ధన్యవాదాలు. మీరడినది యతి స్థానం గురించే కదండి. అవునండి యతి స్థానం కింది అండర్ లైనుతోను + ఖతి రంగు మార్పుతోను, ప్రాసాక్షరాలు బొద్దు (బోల్డు) + ఖతి రంగు మార్పుతోను సూచిస్తున్నా. ఎందుకంటే తెలుగు పద్య లక్షణాలకు విశిష్ట ప్రత్యేకతల నిచ్చేవి యతి, ప్రాసలు, సాధారణ లక్షణాలు గణ నియమాలే కదండి.
ఈ విషయం ఇవాళిటి 'ప్రాణేశ' పద్యంలో సూచించాను.
కవితగారు మరొక్క విషయం మన మన తెలుగు పద్యానికి ఉండే ప్రధాన లక్షణాలైన గణ, యతి, ప్రాస గురించి తెలుగుభాగవతం.ఆర్గ్ లో వ్యాకరణం కింద ఛందోపరిచయంలో సూచించాను. ఆ లంకె http://telugubhagavatam.org/productsline.php?scatid=38&catid=11.
ఉత్పలమాల మున్నగు వృత్త పద్యాలు, జాతి పద్యాలు కంద, ఉపజాతి పద్యాలైన సీసం, ఆటవెలది మున్నగునవి, దండకాది ఇతర ప్రక్రియలు మొత్తం 31 రకాలు తెలుగు భాగవతంలో ప్రయోగించబడ్డాయి. వాటన్నిటి లక్షణాలు కూడ అదే లంకెలో సూచించాను. చూడండి.
ఆ వృత్తాదుల జాబితా ఏవి ఎన్ని ప్రయోగించారు లెక్క కింది లంకెలో చూడగలరు.
http://telugubhagavatam.org/products_running.php?psid=1014&catid=9&scatid=4&ccatid=
Post a Comment