చందనాదుల
1-279-తే.
చందనాదుల నాఁకట స్రగ్గువాఁడు
దనివి నొందని కైవడి ధర్మసుతుఁడు
సంపదలు పెక్కు గలిగియుఁ జక్రిపాద
సేవనంబులఁ పరిపూర్తి సెందకుండె.
మంచి గంధం లాంటి శృంగార ద్రవ్యాలు ఎన్ని
ఉన్నా ఆకలితో అల్లాడే వాడు తిండి కోసం ఎంతో ఆతృతతో ఉంటాడు. కౌరవులను ఓడించి
ధర్మరాజు సమస్త రాజ్య సంపదలు పొందాకా కూడ, శ్రీకృష్ణ భగవానుని ఎంత సేవిస్తున్నా, ఇంకా
సేవించాలని అంతటి ఆతృత కలిగి ఉన్నాడుట. – పాండవుల భక్తి ప్రపత్తులు అంతటివి అన్నమాట.
1-279-tae.
chaMdanaadula
naa@MkaTa sragguvaa@MDu
danivi
noMdani kaivaDi dharmasutu@MDu
saMpadalu
pekku galigiyu@M jakripaada
saevanaMbula@M
paripoorti seMdakuMDe.
చందన = మంచిగంధం;
ఆదులన్ = మొదలగు వాని వలన; ఆఁకటన్ = ఆకలితో; స్రగ్గువాఁడు = కుంచించుకొని పోవు
వాడు; తనివిన్ = సంతృప్తిని; ఒందని = పొందని; కైవడిన్ = విధముగ; ధర్మసుతుఁడు = ధర్మరాజు {ధర్మసుతుఁడు – యమధర్మరాజు
పుత్రుడు, ధర్మరాజు};
సంపదలు = సంపదలు; పెక్కున్ = చాలా; కలిగియున్ = కలిగి ఉన్నప్పటికిని; చక్రి = చక్రాయుధుని / హరి{చక్రి – చక్రము
ఆయుధముగా గల వాడు, కృష్ణుని };
పాద = పాదములను; సేవనంబులన్ = కొలచుట యందు; పరిపూర్తి = సంతృప్తి; చెందకన్ = చెందకుండగ; ఉండెన్ = ఉండెను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment