Friday, January 10, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 167

ee saukumaaryal

3-728-క.
సౌకుమార్య మీ వయ
సీ సౌందర్యక్రమంబు నీ ధైర్యంబు
న్నీ సౌభాగ్య విశేషము
నే తులకుఁ గలదు? చూడ నిదిచిత్రమగున్.

          ఆహాహ ఎంత మృదువైన దేహము, ఎంతటి నవయౌవనము, ఎంత చక్కటి శరీర సౌష్టవము, ఎంతటి జాణతనము, ఎంత ఎక్కువ సౌభగ్యం. ఇంతటి విశేషాలు ఏ స్త్రీలలో మాత్రం ఉన్నాయి. అబ్బో ఈమె చాలా చిత్రంగా ఉందే.
సృష్ట్యాదిలో రాక్షసులు జనించారు. కాముకత సృష్టి నిరంతరంగా జరగటానికి వలసినదే. కాని కాముక లోలత్వము, అది మితిమీరుట నియంత్రించుకోలేక పోవుట దౌర్భల్యం యిది రాక్షసత్వ లక్షణం, పరిహరించ దగినవి. బ్రహ్మదేవుని కోరిక మేరకు వారిని నియంత్రించడానికి విష్ణుమాయ సంధ్యా సుందరిని సృష్టించింది. వారికి ఇలా అపూర్వ సౌందర్యరాశిలా కనిపించి ఆకర్షిస్తోంది. ఇలాంటి సౌందర్యారోపణకి కారణమైన లోలత్వమే మోహం. ఇక్కడ చిత్రం ఏమంటే ఆమెనుండి ప్రతిస్పందన శూన్యం. ఐనా నియంత్రించు కోలేని వారి ఆ లోలత్వాన్ని కార ప్రాస సూచిస్తోందా?.

3-728-ka.
ee saukumaarya mee vaya
see sauMdarya kramaMbu nee dhairyaMbu
nnee saubhaagya viSaeshamu
nae satulaku@M galadu? chooDa nidi chitra magun.

          = ; సౌకుమార్యమున్ = సుకుమారత్వము, మృదుత్వము; = ; వయస్ = యౌవనము; = ; సౌందర్య క్రమమున్ = సుందరత, చక్కటి అంగసౌష్టవము; = ; ధైర్యంబున్ = ఆత్మవిశ్వాసము; = ; సౌభాగ్య = సౌభాగ్యము యొక్క; విశేషమున్ = అధిక్యము; = ; సతుల్ = స్త్రీల; కున్ = కి; కలదు = ఉన్నది; చూడన్ = చూస్తే; ఇది = ఇది; చిత్రము = విచిత్రము; అగున్ = అయి ఉన్నది.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: