హంసతురంగముం
6-3-ఉ.
హంసతురంగముం బరమహంసము నంచితదేవతా
కులో
త్తంసము నాగమాంత
విదితధ్రువ
పుణ్యరమావతంసమున్
కంసజిఘాంసు నంశమును గర్బురసూత్ర
సమావృతాంసమున్
హింస నడంచు బ్రహ్మము నహీన శుభంబులకై
భజించెదన్.
షష్ఠస్కంధారంభ
బ్రహ్మదేవుని స్తోత్రం - హంస వాహనం చరించెడి పరమహంస స్వరూపు డైన
వాడు; మాననీయులైన
దేవతలకు తలమాన మైన వాడు; ఉపనిషత్తులందు ప్రతిపాదిత మైన అక్షయ పుణ్య సంపన్నులలో మేలైన
వాడు; వాసుదేవుని
అంశతో ఉద్భవించినవాడు; కాంచన యజ్ఞోపవీతాలు ధరించిన భుజాగ్రములు కల వాడు; హింసా
ప్రవృత్తిని నివృత్తి చేసే వాడు అయిన బ్రహ్మదేవుణ్ణి అనంత శ్రేయోలబ్దికై
ఆరాధిస్తాను
6-3-u.
haMsaturaMgamuM
baramahaMsamu naMchitadaevataa kulO
ttaMsamu
naagamaaMta vidita dhruvapuNyaramaavataMsamun
kaMsajiMghaaMsu
naMSamunu garburasootra samaavRtaaMsamun
hiMsa
naDaMchu brahmamu naheena SubhaMbulakai bhajiMchedan.
హంస తురంగమున్ = బ్రహ్మదేవుని {హంస తురంగము - హంసను తురంగము (వాహనము)గా గల వాడు, బ్రహ్మ};
పరమ హంసమున్ = బ్రహ్మదేవుని {పరమ హంసము - పరమ హంస యైన వాడు, బ్రహ్మ}; అంచిత దేవతా కులోత్తంసమున్ = బ్రహ్మదేవుని {అంచిత దేవతా కులోత్తంసము - అంచిత (చక్కగా) దేవతా
(దేవతల) కుల (సమూహము నందు) ఉత్తంసము (శ్రేష్ట మైన వాడు), బ్రహ్మ}; ఆగమాంత విదిత ధ్రువ
పుణ్య రమా వతంసమున్ = బ్రహ్మదేవుని {ఆగమాంత విదిత ధ్రువ పుణ్య రమా వతంసము - ఆగమాంత (వేదాంతములో) విదిత (తెలుపబడి) ధ్రువ (నిశ్చయ మైన) పుణ్యము యొక్క
రమా (శోభను) వతంసము (సిగబంతి, శిరస్సున ధరించినవాడు), బ్రహ్మ}; కంస జిఘాంసు నంశమున్ = బ్రహ్మదేవుని {కంస జిఘాంసు నంశము - కంస (కంసుని) జిఘాంసుని (శత్రువు
యొక్క) అంశము (అంశ అయిన వాడు), బ్రహ్మ};
కర్బుర సూత్ర సమావృతాం
సమున్ = బ్రహ్మదేవుని {కర్బుర సూత్ర సమావృతాంసము - కర్బుర (బంగారు) సూత్ర (యజ్ఞువీతము)చే సమావృత (చక్కగా కలిగిన) అంసము
(మూపుగలవాడు),
బ్రహ్మ}; హింస నడంచు బ్రహ్మమున్ = బ్రహ్మదేవుని {హింస నడంచు బ్రహ్మము - హింసను అణచివేసెడి
పరబ్రహ్మ, బ్రహ్మ}; అహీన = గొప్ప; శుభముల్ = శుభముల; కై = కొరకు; భజించెదన్ = కొలిచెదను;
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment