Sunday, January 12, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 169

chinnayannalaaraa

9-353-ఆ.
చిన్నయన్నలార! శీతాంశుముఖులార!
నళినదళవిశాలయనులార!
మధురభాషులార! హిమీఁద నెవ్వరు
దల్లిదండ్రి మీకు న్యులార?

          ఓ చిన్ని బాబులు! మీ మోములు చంద్రబింబాల్లా ప్రకాశిస్తున్నాయి. మీ కన్నులు కలువరేకులలా వెడల్పుగా అందంగా ఉన్నాయి. మీ పలుకు మధురంగా ఉన్నాయి. లోకంలో మీలాంటి వారి తల్లిదండ్రులు ధన్యులు; మీ తల్లిదండ్రులు ఎవరు నాయనలారా? – అని మర్యాదకు మారుపేరైన శ్రీరామచంద్రమూర్తి తన యజ్ఞశాలకి వచ్చి రామకథ గానం చేస్తున్న కుశలవులను ప్రశ్నించాడు. పోతనగారి పాత్రౌచిత్య, సందర్భౌచిత్యమైన లలిత పదాలు నడక లాలిత్యం ఈ మృదు మధురమైన పద్యంలో ప్రతిఫలిస్తున్నాయి.


9-353-aa.
chinnayannalaaraa! SeetaaMSumukhulaara!
naLinadaLaviSaalanayanulaara!
madhurabhaashulaara! mahimee@Mda nevvaru
dallidaMDri meeku dhanyulaara?

          చిన్ని = చిన్న; అన్నలారా = పిల్లలు; శీతాంశు = చంద్రుని వంటి; ముఖులారా = మోములు కలవారు; నళిన = కలువ; దళ = రేకులవంటి; విశాల = పెద్ద; నయనులారా = కళ్ళున్నవారు; మధుర = తియ్యని; భాషులార = మాట్లాడువారు; మహి = భూమి; మీదన్ = పైన; ఎవ్వరు = ఎవరు; తల్లిదండ్రి = తల్లదండ్రులు; మీ = మీ; కున్ = కు; ధన్యులార = పుణ్యవంతులైన వారు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: