kaadanaDu
8-657-క.
కా దనఁడు పొమ్ము లే దీ
రా దనఁడు జగత్త్ర యైక రాజ్యము నిచ్చెన్
నా దయితుఁ గట్టనేటికి?
శ్రీదయితాచిత్తచోర! శ్రితమందారా!
ఆశ్రిత జనుల పాలిటి కల్పవృక్షమా! “ కాదు, లేదు, పో, ఇవ్వను” అన లేదు కదా.
మొత్తం ముల్లోకాల రాజ్యాన్ని నీకు ఇచ్చేసాడు కదా! ఇంకెందుకు
స్వామీ! లక్ష్మీపతీ! నా పతిని బంధిస్తున్నావు?
వామనావతారుడైన శ్రీమహా విష్ణువు త్రివిక్రమరూపాన్ని
ఉపసంహరించిన పిమ్మట బలిచక్రవర్తిని బంధించాడు. అప్పుడు అతని భార్య వింధ్యావళి ఇలా బంధించటం
ధర్మం కాదు అని అడిగింది. కోరినవాటిని అనుగ్రహించే నువ్వు కోరిన ముల్లోకాలు నీకు
ఇచ్చేసాడు కదా. శ్రీపతి! నా పతిని అనుగ్రహించు అని అడిగింది. అనంతరం బలిచక్రవర్తిని
సకల భోగాలతో తులతూగే సురక్షితమైన సుతలలోక రాజ్యాధికారాన్ని ఏలుకుంటూ బంధుమిత్ర
పరివార సమేతంగా నివసించమని విష్ణుమూర్తి అనుగ్రహించాడు.
8-657-ka.
kaa dana@MDu
pommu lae dee
raa dana@MDu
jagattra yaika raajyamu nichchen
naa dayitu@M
gaTTanaeTiki?
SreedayitaachittachOra!
SritamaMdaaraa!
కాదు = కాదు; అనడు = అన్నవాడు కాదు; పొమ్ము = వెళ్ళిపో; లేదు = లేదు; ఈరాదు = ఇవ్వలేను; అనడు = అన్నవాడు కాదు; జగత్రయ = ముల్లోకముల యొక్క; ఏక = మొత్తము; రాజ్యమున్ = రాజ్యాధికారమును; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; నా = నా యొక్క; దయితున్ = భర్తను; కట్టన్ = బంధించుట; ఏటికి = ఎందుకు; శ్రీదయితాచిత్తచోర = నారాయణ {శ్రీదయితాచిత్తచోరుడు - లక్ష్మీదేవియొక్క
చిత్తచోర (మనసు
దొంగిలించిన వాడు), విష్ణువు}; శ్రితమందార = నారాయణ {శ్రితమందార -
ఆశ్రయించినవారికి కల్పవృక్షము వంటి వాడు, విష్ణువు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment