చెచ్చెర
1-254-క.
చెచ్చెరఁ గరినగరికి నీ
విచ్చేసిన నిమిషమైన వేయేండ్లగు నీ
వెచ్చోటికి విచ్చేయక
మచ్చికతో నుండుమయ్య మా నగరమునన్.
ప్రభు! నీవు
మాటిమాటికి హస్తినాపురానికి వెళ్తున్నావు. అలా వెళ్ళినప్పు డల్లా ప్రతి నిమిషము
మాకు పదివందల సంవత్సరాల లాగ అనిపిస్తున్నది. అందుచేత, మా ద్వారకానగరాన్ని వదలి
ఎక్కడకి వెళ్ళకుండా ప్రేమగా ఇక్కడే ఉండిపోవయ్య నల్లనయ్య!
- అని దీర్ఘకాలపు ఎడబాటు తరువాత కలిసిన ద్వారకా వాసులు, ధర్మరాజు
పట్టాభిషేకం పిమ్మట హస్తినాపురం నుండి తిరిగి వచ్చిన శ్రీకృష్ణునితో
చెప్పుకుంటున్నారు. 'చ్చ' కార ద్విక్తాక్షర ప్రాసతో సందర్భానికి తగిన నడకతో పద్యం అందంగా
ద్విగుణీకృతమైంది.
1-254-ka.
chechchera@M
garinagariki nee
vichchaesina
nimishamaina vaeyaeMDlagu nee
vechchOTiki
vichchaeyaka
machchikatO
nuMDumayya maa nagaramunan.
చెచ్చెరన్ = తొందరతొందరగా;
కరినగరి = హస్తినాపురము; కిన్ = నకు; నీవు = నీవు; విచ్చేసిన = వెళ్ళిన; నిమిషము = నిమిష మాత్రపు సమయము; ఐన = అయినను; వేయి = పది వందల; ఏడ్లు = సంవత్సరములు; అగు = వలె ఉండును; నీవు = నీవు; ఎచ్చోటి = ఎక్కడ; కిన్ = కును; విచ్చేయక = వెళ్ళకుండగ; మచ్చిక = ప్రేమ; తోన్ = తో; ఉండుము = ఉండుము; అయ్య = తండ్రీ; మా = మాయొక్క; నగరమునన్ = నగరములో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment