parvatadvaMdvaMbu
10.2-733-సీ.
పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు; మృగపతిద్వితయంబు
వృషభయుగము
పావకద్వయము దంతావళయుగళంబు; దలపడు
వీఁక నుద్దండలీలఁ
గదిసి యన్యోన్యభీకరగదాహతులను; గ్రంబుగ
విస్ఫులింగములు సెదరఁ
గెరలుచు సవ్యదక్షిణమండలభ్రమ; ణములను
సింహచంక్రమణములను
తే. గదిసి పాయుచు డాసి
డగ్గఱచు
మింటి
కెగసి క్రుంగుచుఁ గ్రుంగి వే యెగసి భూమి
పగుల నార్చి ఛటచ్ఛటోద్భటమహోగ్ర
ఘనగదాఘట్టనధ్వని గగనమగల.
భీమ జరాసంధులు
ఇద్దరు ఘోరంగా పోరుతున్నారు. అది ఎలా ఉందంటే –రెండు పర్వతాలు, రెండు సముద్రాలు,
రెండు వృభాలు, రెండు అగ్నులు, రెండు మదించిన ఏనుగులు ఒకదానితో ఒకటి భయంకరంగా తలపడుతున్నట్లుగా
ఉంది. విజృంభించి సింహనాదాలు చేస్తున్నారు పై కెగురుతున్నారు, భూమి పగిలిపోయేలా నేలపైకి
దూకుతున్నారు, ఒకళ్ళ నొకళ్ళు తోసుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. కుడి ఎడమలకు
తిరుగుతున్నారు, అతి భయంకరమైన వారి గదా ఘట్టనలకి నిప్పురవ్వలు రాలుతున్నాయి, ఆకాశం
అదిరిపోతోంది..
10.2-733-see.
parvatadvaMdvaMbu
paathOdhiyugaLaMbu; mRgapatidvitayaMbu vRshabhayugamu
paavakadvayamu
daMtaavaLayugaLaMbu; dalapaDu vee@Mka nuddaMDaleela@M
gadisi
yanyOnyabheekaragadaahatulanu; graMbuga visphuliMgamulu sedara@M
geraluchu
savyadakshiNamaMDalabhrama; Namulanu siMhachaMkramaNamulanu
tae. gadisi
paayuchu Daasi DaggaRachu miMTi
kegasi
kruMguchu@M gruMgi vae yegasi bhoomi
pagula
naarchi ChaTachChaTOdbhaTamahOgra
ghanagadaaghaTTanadhvani
gaganamagala.
పర్వత = కొండల; ద్వంద్వంబున్ = జంట; పాథోధి = సముద్రముల; యుగళంబు = జంట; మృగపతి = సింహములు; ద్వితయంబున్ = రెండు; వృషభ = ఆబోతులు; యుగమున్ = జత; పావక = అగ్నులు; ద్వయమున్ = రెండు; దంతావళ = ఎనుగుల; యుగళంబున్ = రెండు; తలపడు = పోరాడు; వీకను = రీతిని; ఉద్దండ = అతిశయము కల; లీలన్ = విధముగా; కదిసి = చేరి; అన్యోన్య = ఒకరి నొకరు; భీకర = భయంకర మైన; గదా = గదల; ఆహతులను = కొట్టుటలు చేత; ఉగ్రంబుగన్ = భయంకరముగ; విస్ఫులింగములు = అగ్నిరవ్వలు; చెదరన్ = రాలగా; కెరలుచున్ = చెలరేగుచు; సవ్య = కుడినుండి ఎడమకు; దక్షిణ = ఎడమనుండి కుడికి; మండల = గుండ్రముగా; భ్రమణములను = తిరుగుటలు; సింహచంక్రమణములను = సింహమువలె దూకుటలు చేత; కదిసి = దగ్గరకువచ్చి; పాయుచున్ = తొలగిపోతూ; పాసి = తొలగి; డగ్గఱచున్ = దగ్గరకువస్తూ; మింటి = ఆకాశమున; కిన్ = కు; ఎగసి = ఎగిరి; క్రుంగుచున్ = వంగిపోతూ; క్రుంగి = వంగిపోయి; వేన్ = వేగముగా; ఎగసి = పైకి ఎగిరి; భూమిన్ = నేల; పగులన్ = బద్ధ లయ్యేలా; ఆర్చి = బొబ్బపెట్టి; ఛటత్ = ఛట; ఛటత్ = ఛట అను; ఉద్భట = అధికమైన; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకర మైన; ఘన = పెద్ద; గదా = గదతోటి; ఘట్టన = కొట్టిన; ధ్వనిన్ = శబ్దము వలన; గగనము = ఆకాశము; అగలన్ = భేదిల్లగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment