Sree madvikhyaati
7-1-క.
శ్రీ మద్విఖ్యాతి లతా
క్రామిత రోదోంతరాళ! కమనీయ మహా
జీమూత తులిత దేహ!
శ్యామల రుచిజాల! రామచంద్ర నృపాలా!
చక్కటి కీర్తిలతలు లోకమంతా వ్యాపించిన వాడా! నీలి మేఘఛాయను పోలెడి మేనివాడ! శ్రీరామచంద్రమహారాజా!
7-1-ka.
Sree madvikhyaati
lataa
kraamita
rOdOMtaraaLa! kamaneeya mahaa
jeemoota
tulita daeha!
Syaamala
ruchijaala! raamachaMdra nRpaalaa!
శ్రీమత్ = సంపద్యుక్తమైన; విఖ్యాతి = కీర్తి యనెడి; లతా = తీగచే; ఆక్రామిత = అల్లుకొనబడిన; రోదస్ = భూమ్యాకాశములు; అంతరాళ = అందలి ప్రదేశములు గల వాడ; కమనీయ = చూడ చక్కని; మహా = పెద్ద; జీమూత = మేఘములతో; తులిత = సరి పోలెడి; దేహ = శరీరపు; శ్యామల = నల్లని; రుచి = కాంతుల; జాల = సమూహములు గల వాడ; రామచంద్ర = శ్రీరామచంద్ర; నృపాల = మహారాజ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment