ghanu Daa
10.1-1727-మ.
ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో?
విని కృష్ణుం డది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?
మహనీయుడైన ఆ విప్రుడు అసలు ద్వారక దాకా
వెళ్ళాడో? లేదో? దారిలో అలిసిపోయి ఆగిపోయాడో? ఒకవేళ నా
సందేశాన్ని విని నందనందనుడు తప్పు పట్టాడేమో? లేకపోతే ఆయన ఈపాటికే
వచ్చేసాడేమో? పరమేశ్వరుడు నా పనయ్యేలా చూస్తాడో? చూడడో? గౌరీమహాదేవి నన్ను
కాపాడుతుందో? కాపాడదో? నా అదృష్టం ఎలా ఉందో? ఏమిటో?
స్వయంవర సమయం దగ్గరకి వచ్చేసింద. రుక్మిణీదేవి అన్యమనస్కంగా
ఉంది. డోలాయమాన స్థితిలో కృష్ణుని రాకకు ఎదురుచూస్తో ఇలా అనుకుంటోంది.
10.1-1727-ma.
ghanu Daa
bhoosuru DaegenO? naDuma maargaSraaMtu@MDai chikkenO?
vini kRshNuM
Dadi tappugaa@M dala@MchenO? vichchaesenO? yeeSvaruM
DanukooliMpa@M
dalaMchunO tala@MpaDO? yaaryaamahaadaeviyun
nanu
rakshiMpa neRuMgunO yeRu@MgadO? naa bhaagya meTlunnadO?
ఘనుడు = గొప్పవాడు; ఆ = ఆ యొక్క; భూసురుడు = విప్రుడు; ఏగెనో = వెళ్ళాడో లేదో; నడుమన్ = మధ్యలో; మార్గ = ప్రయాణపు; శ్రాంతుడు = బడలిక చెందినవాడు; ఐ = అయ్యి; చిక్కెనో = చిక్కుబడిపోయెనేమో; విని = విన్నవాడై; కృష్ణుండు = కృష్ణుడు; అది = దానిని; తప్పు = తప్పు; కాన్ = అయినట్లు; తలచెనో = భావించెనేమో; విచ్చేసెనో = వచ్చెనేమో; ఈశ్వరుండు = భగవంతుడు; అనుకూలింపన్ = అనుకూలించవలెనని; తలంచునో = ఎంచునో; తలపడో = ఎంచకుండునో; ఆర్యామహాదేవియున్ = పార్వతీదేవి {ఆర్య -
శ్రేష్ఠురాలు, పార్వతి}; ననున్ = నన్ను; రక్షింపన్ = కాపాడవలెనని; ఎఱుంగునో = గుర్తించినదో; ఎఱుగదో = గుర్తించలేదో; నా = నా యొక్క; భాగ్యము = అదృష్టము; ఎట్లున్నదో = ఎలా ఉందో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment