రామున్
2-160-క.
రామున్ మేచకజలద
శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవసు
త్రామున్ దుష్టనిశాటవి
రామున్ బొమ్మనియెఁ బంక్తిరథుఁ డడవులకున్.
నల్లని మేఘఛాయతో మెరిసిపోతు ఉండే వాడు,
సర్వసుగుణాలతో ఒప్పి ఉండే వాడు, ఐశ్వర్యంతో ఇంద్రునికి సాటివచ్చే వాడు, దుష్టులైన
రాక్షసులను చెండాడెడి వాడు అయిన శ్రీరామచంద్రుడిని దశరథుడు అడవులకు పొమ్మన్నాడు.
2-160-ka.
raamun
maechakajalada
Syaamun
suguNaabhiraamu sadvaibhavasu
traamun dushTaniSaaTavi
raamun
bommaniye@M baMktirathu@M DaDavulakun.
రామున్ = రాముని; మేచక = నల్లని; జలద = మేఘము వంటి; శ్యామున్ = చాయ కలవానిని; సుగుణ = సుగుణములతో; అభిరామున్ = అందమైన వానిని; సత్ = మంచి, గొప్ప; వైభవ = వైభవముతో; సుత్రామున్ = దేవేంద్రుని వంటి వానిని {సుత్రాముడు – లోకములను లెస్సగా రక్షించువాడు,
ఇంద్రుడు}; దుష్ట = చెడ్డ; నిశాటన్ = రాక్షసులను; విరామున్ = సంహరించిన వానిని; పొమ్ము = వెళ్ళుము; అనియెన్ = అనెను; పంక్తిరథుఁడు = దశరథుడు {పంక్తి - పది, దశ}; అడవులన్ = అడవుల; కున్ = కు;
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment