డింభక
7-279-క.
డింభక! సర్వస్థలముల
నంభోరుహనేత్రుఁ డుండు ననుచు మిగుల సం
రంభంబునఁ బలికెద వీ
స్తంభంబునఁ జూపఁ గలవె చక్రిన్ గిక్రిన్.
ఓరి పెంకిపిల్లాడా! పద్మాక్షుడు
విష్ణుమూర్తి సర్వవ్యాపి అన్నిట ఉంటాడని ఇంత గట్టిగా చెప్తున్నావు. అయితే మరి ఈ
స్తంభంలో చూపించగలవా ఆ చక్రం గిక్రం పట్టుకు తిరిగేవాణ్ణి.
నరసింహార్భావ సమయం దగ్గరకి వచ్చేసింది. కొడుకు ప్రహ్లాదుడు
శాంతరస పరిపూర్ణుడై నారాయణుడు సర్వేసర్వత్రా ఉండేవాడు అని శాంతంగా చెప్తుంటే.
రౌద్రరసావేశ ఉద్రేకంతో ఊగిపోతున్న తండ్రి హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుణ్ణి
తర్జిస్తున్నాడు. ఇక్కడ వత్తు‘భ’కార ప్రాస, చక్రిన్ గిక్రిన్ అనే వ్యంగ్య ప్రయోగాలు
పద్యంలో ఆ రౌద్రరస సార్థకత ఉంది. హిరణ్యకశిపుని పాత్రౌచిత్యానికి తగిన పద్యనడక
ఉంది.
7-279-ka.
DiMbhaka!
sarva sthalamula
naMbhOruhanaetru@M
DuMDu nanuchu migula saM
raMbhaMbuna@M
balikeda vee
staMbhaMbuna@M
joopa@M galave chakrin gikrin.
డింభక = కుర్రవాడా; సర్వ = ఎల్ల; స్థలములన్ = ప్రదేశము లందును; అంభోరుహ నేత్రుండు = హరి {అంభోరుహ నేత్రుడు - అంభోరుహ (పద్మముల) వంటి
నేత్రుడు (కన్నులు
గలవాడు), విష్ణువు}; ఉండున్ = ఉంటాడు; అనుచున్ = అనుచు; మిగులన్ = మిక్కలి; సంరంభంబునన్ = ఆటోపముతో; పలికెదవు = చెప్పెదవు; ఈ = ఈ; స్తంభంబునన్ = స్తంభము నందు; చూపగలవె = చూపించగలవా; చక్రిన్ = విష్ణుని; గిక్రిన్ = గిక్రిని
(చక్రికి ఎగతాళి రూపము).
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment