చన్నువిడిచి
10.1-331-క.
చన్ను విడిచి చనఁ డిట్టటు
నెన్నఁడుఁ బొరిగిండ్ల త్రోవ లెఱుఁగఁడు నేడుం
గన్నులు దెఱవని మా యీ
చిన్ని కుమారకుని ఱవ్వ చేయం దగునే?
మా కన్నయ్య చంటాడు నా ఒళ్ళో కూర్చుండి
పాలు తాగుతుండటమే తప్ప నన్ను వదలి ఈ పక్కకి ఆ పక్కకి పోడు. పక్కింటికి కూడ దారి
తెలియదు. అలాంటి ఈ నాటికి సరిగా కళ్ళు తెరవడంరాని పసిగుడ్డును ఇలా అల్లరి పెట్టడం
మీకు తగినపని కాదు. – అని తల్లి యశోదాదేవి తన వద్దకు వచ్చి బాలకృష్ణుని అల్లరి
చెప్పిన గోపికలను సమాధాన పరస్తోంది.
10.1-331-ka.
channu
viDichi chana@M DiTTaTu
nenna@MDu@M
borigiMDla trOva leRu@Mga@MDu naeDuM
gannulu deRavani
maa yee
chinni
kumaarakuni Ravva chaeyaM dagunae?
చన్ను = చనుబాలు తాగుట; విడిచి = వదలి; చనడు = వెళ్ళడు; ఇట్టట్టు = ఎటు పక్కకి; ఎన్నడున్ = ఎప్పుడు కూడ; పొరుగు = పక్క వారి; ఇండ్లన్ = ఇళ్ళకి; త్రోవలు = దారి కూడ; ఎఱుగడు = తెలియని వాడు; నేడున్ = ఇప్పటికి; కన్నులు = కళ్లు; తెఱవని = తెరవనట్టి; మా = మా యొక్క; ఈ = ఈ; చిన్ని = చంటి; కుమారకునిన్ = పిల్లవానిని; ఱవ్వ = అల్లరి, గొడవ; చేయన్ = చేయుట; తగునే = తగిన పనేనా, కాదు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment