Thursday, January 16, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 172

ప్రాణేశ

 10.1-1711-సీ.
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; కర్ణరంధ్రంబుల లిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగాలేని; తనులతవలని సౌంర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; చక్షురింద్రియముల త్వ మేల?
దయిత! నీ యధరామృతం బానఁగాలేని; జిహ్వకు ఫలరస సిద్ధి యేల?
ఆ. నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బ దేని ఘ్రాణ మేల?
ధన్యచరిత! నీకు దాస్యంబుజేయని
జన్మ మేల? యెన్ని న్మములకు.

          రుక్మిణీదేవి తనను తీసుకుపోయి పెండ్లి చేసుకొనమని అగ్నిద్యోతనుడు అనే విప్రుని ద్వారా శ్రీకృష్ణునికి రహస్య సందేశం పంపింది. అతను ద్వారకకు వచ్చి ఆ విషయం శ్రీకృష్ణునికి విన్నవిస్తున్నాడు -
ఓ ప్రాణవల్లభా! నీ మధురమైన మాటలు వినలేనట్టి చెవులు ఉండటం అనవసరం. పురుషోత్తమా! నీవు అనుభవించని ఈ శరీర లావణ్య సౌందర్యాలు ఎందుకు కొరగానివి. జగన్మోహనమూర్తీ! నిన్ను చూడటానికి నోచని కళ్ళకు చూపులు ఎందుకు దండగ. జీవితేశ్వరా! నీ అధరసుధారసం ఆస్వాదించలేనట్టి నాలుకకు మధురమైన రుచుల ప్రాప్తి ఉండేం లాభం. పద్మాక్షా! నీవు వేసుకొన్న వనమాలికల సౌరభం ఆఘ్రాణించలేని ముక్కు ఉండటమే శుద్ద దండగ. ధన్యచరితా! నీ పాదసేవకు ఉపకరించని జన్మలు ఎన్ని ఎత్తినా ప్రయోజనం శూన్యమేనయ్య.
మన తెలుగు భాషా ప్రక్రియ పద్యాల అందం చెప్పనలవి కాదు కదా. అందులోను యతి ప్రాసలు చెప్పుకోదగ్గవి. సీసపద్యానికి, ఆటవెలదికి ప్రాస నియమం లేదు. సీసపద్యానికి 1వ, 3వ మరియు 5వ, 7వ గణాల మొదటి అక్షరాలకి యతి మైత్రి ఉండాలి. ఆటవెలదికి 4వ గణాద్యక్షరం యతి స్థానం. యతి మైత్రి అంటే పద్యా పాద మొదటి అక్షరానికి మిత్రత్వం గల అక్షరం ఆ పాదంలోని ఫలానా అక్షర స్థానంలో ఉండాలి అనే నియమం. యతి స్థానాన్ని ఆ అక్షరానికి కింద గీత సూచిస్తుంది.

10.1-1711-see.
praaNaeSa! nee maMju bhaashalu vinalaeni; karNaraMdhraMbula kalimi yaela?
purusharatnama! neevu bhOgiMpa@Mgaalaeni; tanulatavalani sauMdarya maela?
bhuvanamOhana! ninnu@M boDagaana@Mgaa laeni; chakshuriMdriyamula satva maela?
dayita! nee yadharaamRtaM baana@Mgaalaeni; jihvaku phalarasa siddhi yaela?
aa. neerajaatanayana! nee vanamaalikaa
gaMdha mabba daeni ghraaNa maela?
dhanyacharita! neeku daasyaMbujaeyani
janma maela? yenni janmamulaku.

          ప్రాణేశా = నా పాణమునకు ప్రభువా; నీ = నీ యొక్క; మంజు = మృదువైన; భాషలున్ = మాటలు; వినలేని = వినజాలని; కర్ణరంధ్రంబుల = చెవులు అనెడివి; కలిమి = ఉండి; ఏలన్ = ఎందుకు; పురుష = పురుషులలో; రత్నమ = శ్రేష్ఠుడా; నీవున్ = నీవు; భోగింపగా = రమించుట; లేని = లేనట్టి; తను = దేహమనెడి; లత = తీగ; వలని = అందలి; సౌందర్యము = అందము; ఏలన్ = ఎందుకు; భువన = ఎల్లలోకములను; మోహన = మోహింపజేయువాడ; నిన్నున్ = నిన్ను; పొడగానగాలేని = చూడజాలని; చక్షురింద్రియముల = కళ్ళకున్; సత్వము = పటుత్వము; ఏలన్ = ఎందుకు; దయిత = ప్రియా; నీ = నీ యొక్క; అధరామృతంబున్ = పెదవులతీయదనమును; పానగాలేని = ఆస్వాదించజాలని; జిహ్వ = నాలుక; కున్ = కు; ఫల = పండ్లను; రస = రుచిచూచుట; సిద్ధి = లభించుట; ఏలన్ = ఎందుకు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: