Sunday, January 5, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 162

aMkili

10.1-1708-ఉ.
అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో!
పంజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే
యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.
          ఓ పద్మనాభా! పురుషోత్తమా! శ్రీకృష్ణా! నా మాటకి అడ్డు చెప్పవద్దు. రథ గజ తురగ పదాతి దళాలతో కూడిన చతురంగబలాలతో రేపే మా విదర్భదేశానికి రా. శిశుపాల, జరాసంధాదులను ఓడించు. నీ పరాక్రమమే ఓలిగా యిచ్చి పెళ్ళికూతురును యెత్తుకుపోయే రాక్షసవివాహ పద్ధతిలో నన్ను చేపట్టు. నేను నీ వెంట రాడానికి సిద్ధంగా ఉంటాను. - అంటు అగ్నిద్యోతనుడనే విప్రుడు రుక్మిణీదేవి సందేశం కృష్ణునికి తెలుపుతున్నాడు.


10.1-1708-u.
aMkili jeppalaedu; chaturaMgabalaMbulatODa nelli yO!
paMkajanaabha! neevu SiSupaala jaraasutulan jayiMchi naa
vaMkaku vachchi raakshasavivaahamunan bhavadeeyaSauryamae
yuMkuva chaesi kRshNa! purushOttama! chaekonipommu vachchedan.
          అంకిలి = అడ్డు; చెప్పన్ = చెప్పుటకు; లేదు = లేదు; చతురంగబలంబుల్ = చతురంగసైన్యము {చతురంగబలము - 1రథములు 2ఏనుగులు 3గుర్రములు 4పదాతిదళము అనెడి నాలుగు అంగములు (విభగములు) కల సేన}; తోడన్ = తోటి; ఎల్లి = రేపు; = ఓయీ; పంకజనాభ = కృష్ణా {పంకజనాభుడు - పద్మము నాభి యందుగలవాడు, విష్ణువు}; నీవు = నీవు; శిశుపాల = శిశుపాలుడు; జరాసుతులన్ = జరాసంధుడులను; జయించి = గెలిచి; నా = నా; వంక = వైపు, సహాయపడుట; కున్ = కు; వచ్చి = వచ్చి; రాక్షస = రాక్షసము పద్ధతి; వివాహమునన్ = వివాహము నందు; భవదీయ = నీ యొక్క; శౌర్యమున్ = పరాక్రమమును; ఉంకువ = ఓలిగా {ఉంకువ - అల్లుడు కన్యకార్థముగా మామ కిచ్చెడి ద్రవ్యము, శుల్కము}; చేసి = చేసి; కృష్ణ = కృష్ణ; పురుష = పురుషులలో; ఉత్తమ = శ్రేష్ఠుడా; చేకొనిపొమ్ము = తీసుకు వెళ్ళుము; వచ్చెదన్ = నేను వస్తాను, సిద్ధంగా ఉన్నాను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: