చలమున
10.1-1343-సీ.
చలమున నను డాసి జలరాశిఁ జొరరాదు; నిగిడి గోత్రముదండ నిలువరాదు;
కేడెంచి కుంభిని
క్రిందకిఁ బోరాదు; మనుజసింహుఁడ నని మలయరాదు;
చేరినఁ బడవైతుఁ జెయ్యి చాపఁగరాదు; బెరసి నా ముందరఁ బెరుగరాదు;
భూనాథ హింసకుఁ బోరాదు నను మీఱి; శోధింతుఁ గానలఁ జొరఁగరాదు;
ఆ. ప్రబలమూర్తి ననుచు భాసిల్లఁగారాదు;
ధరఁ బ్రబుద్ధుఁడ నని దఱుమరాదు;
కలికితనము చూపి గర్వింపఁగారాదు;
తరముగాదు; కృష్ణ! తలఁగుతలఁగు.
ఓ కృష్ణా! పౌరుషానికి
పోయి నా దగ్గరకి వచ్చేక ఇక వేషాలేసి నాటకాలాడి తప్పించుకు పోడానికి అవకాశం ఉండదు
జాగ్రత్త. తర్వాత (మత్యావతారంలో లా చేపలా వేషం కట్టి) సముద్రంలోకి పోడానికీ కుదరదు.
(కూర్మావతారంలో మంథర పర్వతానికి కింద నిలబడి ఆధారంగా ఉన్నా నని తాబేలు వేషం కట్టి)
కొండల దన్ను తీసుకోడానికీ అవ్వదు. (వరహావతారంలో భూమిని ధరించి దాని కిందున్నా కదా
అని పంది వేషం కట్టి) తప్పించుకుపోయి భూమి కిందకి దూరడానికీ వీలవదు. (నరసింహావతారం
ఎత్తిన వాడిని కదా అని) సింహంలాంటి మగాణ్ణి అన్ని విర్రవీగడానికీ కుదరదు. (వామనావతారంలో
చెయ్యి చాచడం అలవాటే అనుకోకు) దగ్గరకొస్తేనే పడదోసేస్తా. ఇక చెయ్యి చాచడానికి కూడ
సందుదొరకదు. (త్రివిక్రమావతారం ఎత్తి పెరిగా కదా అని) నా ఎదురుగా పెచ్చుమీరడమూ
అలవికాదు. (పరశురామావాతారంలో రాజులను చంపేసా అనుకోకు) నన్ను దాటి రాజుని హింసించడ
మన్నది సాధ్యం కాదు. (రామావతారంలో అడవులకు పోయా కదా అని) అవసరమైతే అరణ్యంల్లో దాక్కుంటా
అనుకోకు, గాలించి మరీ పట్టుకుంటా. (బలరామావతారం ఎత్తిన) ప్రబలమైన ఆకారం కలవాడను
నేనే అని విర్రవీగడానికీ వీలుండదు. (బుద్ధావతారం ఎత్తిన వాడిని) పుడమిలో నేనే
ప్రబుద్ధుణ్ణి అని బెదిరించి తరిమేద్దాం అనీ (కల్కి అవతారం ఎత్తుతా కదా అని)
కపటంతో జయించేస్తా అని గర్వించటమూ వీలుకాదు సుమా. నాతో యుద్ధం చేయడం నీ తరంగాదులే, పో కృష్ణా! పారిపో.
అంటున్నాడు కంససభలో చాణూరుడు. ఇక్కడ కృష్ణుణ్ణి నిందిస్తున్న
కూడ అంతర్లీనంగా దశావతారాలు ఎత్తిన
భగవంతుడివి నువ్వే అన్న స్తోత్రం అంతర్లీనంగా ఉంది. ఇలా చాణూరుని ప్రగల్భాలలో అతి చక్కటి
నిందాస్తుతి అందించిన మన పోతనామాత్యులు పూజనీయులు.
గమనిక - కింది గీతతో చూపిన ఎర్ర ఖతి యతి
స్తానం.
10.1-1343-see.
chalamuna
nanu Daasi jalaraaSi@M joraraadu; nigiDi gOtramudaMDa
niluvaraadu;
kaeDeMchi
kuMbhini kriMdaki@M bOraadu; manujasiMhu@MDa nani
malayaraadu;
chaerina@M
baDavaitu@M jeyyi chaapa@Mgaraadu; berasi naa muMdara@M
berugaraadu;
bhoonaatha
hiMsaku@M bOraadu nanu meeRi; SOdhiMtu@M gaanala@M
jora@Mgaraadu;
aa. prabalamoorti
nanuchu bhaasilla@Mgaaraadu;
dhara@M
brabuddhu@MDa nani daRumaraadu;
kalikitanamu
choopi garviMpa@Mgaaraadu;
taramugaadu;
kRshNa! tala@Mgutala@Mgu.
చలమున = పట్టుదలతో; ననున్ = నన్ను; డాసి = ఎదిరించి; జలరాశిన్ = సముద్రము నందు; చొరరాదు = దూరకూడదు (మత్యావతారుడవై); నిగిడి = అతిశయించి, నిక్కి; గోత్రము = కొండ (మంథర) కు; దండ = ఆధారముగ; నిలువరాదు = ఉండకూడదు (కూర్మావతారుడవై); కేడెంచి = మారుమొగము పెట్టుకొని; కుంభిన్ = భూమి; క్రింద = కింద; కిన్ = కి; పోరాదు = పోకూడదు (వరహావతారుడవై); మనుజసింహుడను = నరులలో సింహమును; అని = అని; మలయరాదు = మెలగకూడదు (నరసింహావతారుడవై); చేరినన్ = దగ్గర కొస్తే; పడవైతున్ = పడదోసెదను; చెయ్యి = చెయ్య; చాపగరాదు = చాపకూడదు (వామనావతారం); బెరసి = చేరి; నా = నా; ముందరన్ = ఎదుట; పెరుగరాదు = ఎదగకూడదు (త్రివిక్రముడవై); భూనాథ = రాజులను; హింస = చంపుట; కున్ = కు; పోరాదు = పోకూడదు (పరశురాముడవై); ననున్ = నన్ను; మీఱి = దాటి; శోధింతున్ = వెదకి పట్టుకొనెదను; కానలన్ = అడవులలో; చొరగరాదు = దూరకూడదు (శ్రీరామావతారుడవై) ;
ప్రబలమూర్తిని = గొప్ప బలము కలవాడను; అనుచున్ = అని; భాసిల్లగారాదు = ప్రకాశింపకూడదు (బలరామావతారుడవై); ధరన్ = భూలోకమున; ప్రబుద్ధుడను = మిక్కలి బుద్ధి కలవాడను; అని = అని; తఱుమరాదు = తరిమేయకూడదు (బుద్ధావతారుడవై); కలికి తనము = కపట చాతుర్యము; చూపి = కనబరచి; గర్వింపగరాదు = అహంకరింప కూడదు (కల్క్యవతారుడవై); తరముగాదు = నీ వల్ల కాదు; కృష్ణ = కృష్ణుడా; తలగుతలగు = తొలగి పొమ్ము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment