bhooshaNamulu
1-46-క.
భూషణములు వాణికి నఘ
శోషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరి గుణోపచిత భాషణముల్.
శ్రీమహా విష్ణువు యొక్క
గుణకీర్తనములతో కూడిన పలుకులు, వాక్కులకు అధిదేవత యైన సరస్వతీ దేవికి అలంకారములు. మృత్య
దేవతకు భయం కలిగించేవి. భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి. సకల
పాపాలను పరిహరించేవి. నిత్యకల్యాణములను సమకూర్చునవి.
శౌనకాది మహర్షులు పుణ్యమూలుని శ్రీమన్నారాయణుని కథలతో కూడిన
భాగవతాన్ని చెప్పమని సూత మహర్షిని
అడుగుతు, విష్ణుకథల మహత్వాన్ని ఇలా
స్మరిస్తున్నారు.
1-46-ka.
bhooshaNamulu
vaaNiki nagha
SOshaNamulu
mRtyuchitta bheeshaNamulu hR
ttOshaNamulu
kalyaaNa vi
SaeshaNamulu
hari guNOpachita bhaashaNamul.
భూషణములు = అలంకారములు; వాణి = సరస్వతి / వాక్కు; కిన్ = కి; అఘ = పాపములను; శోషణములు = ఇంకునట్లు చేయునవి; మృత్యు = మృత్యువు యొక్క; చిత్త = మనసునకు; భీషణములు = భయం కలిగించేవి; హృత్ = హృదయమునకు; తోషణములు = తుష్టి కలిగించేవి; కల్యాణవిశేషణములు = శుభకరమైన; విశేషణములు = విశిష్టతలను ఇచ్చునవి; హరి = హరియొక్క; గుణ = గుణములతో; ఉపచిత = కూడిన; భాషణముల్ = పలుకులు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
4 comments:
మీ పద భూషణములకు వినమ్రముగా మొక్కుతున్నాను.
ధన్యవాదాలు మెరాజ్ గారు. మీ వినయ ఔదార్య సంపద సర్వదా ప్రశంసనీయం.
Post a Comment