శ్రీ అయ్యగారి నాగేంద్ర గారు, శ్రీ రాధాకృష్ణ గారు మరియు ఇతర సత్సంగ సభ్యుల ఆద్వర్యంలో అక్టోబరు 2వ తారీఖు 2013 న అంబర్ పేట్ శ్రీ సాయిబాబా సంస్థాన్ హాలులో సత్సంగ సభ జరిగింది.
తెలుగు భాగవతం జాలిక ఎలా మొదలయ్యింది, అందులో కల అంశాలు ఏమిటి అది ఏ రకంగా వృద్ది చెందుతోందో శ్రీ సాంబ శివరావు గారు వివరించారు.
శ్రీ కణాద గారు మాట్లాడుతూ మన మహాకవి సార్వభౌముడు విశ్వనాధ సత్యన్నారాయణ గారు తనకి ఏ కష్టం వచ్చినా నారాయణ కవచం పఠించి మంత్రరాజంగా ప్రయోగించేవారని, దీనిని పూర్వం ఇంద్రుడు ప్రయోగించి శత్రు బాధల నుండి బయట పడ్డాడని వివరించి భాగవతంలో నుంచి కొన్ని పద్యాలు హృద్యంగా గానం చేసారు.
ఇది సర్వ రక్షణ కవచంగాను, ముఖ్యంగా గర్భరక్షణార్థ కవచంగా ఐదవ మాసంలో ప్రయోగించటం పూర్వం నుంచి ఉన్నదే. ఇట్టి చక్కటి ఫలితంతో ఆనందించిన దృష్టాంతం ఈ సత్సంగ సభలో శ్రీ మహేశ్ గారు నారాయణ కవచం గురించి తన స్వీయ అనుభవాన్ని పంచుకున్నారు.
ఆత్మీయ సత్సంగ సభ్యులు తెలుగు భాగవతానికి చూపిన ఆదరాభిమాన సత్కారాలకు అనేక ధన్యవాద పూర్వక నమస్కారాలు.
గమనిక: శ్రీ నారాయణ కవచం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
1 comment:
శ్రీ సాంబశివరావు గార్కి, ఇతర సభ్యులకు తక్కువ సమయంలో ఆహ్వానించినా వచ్చి సత్సంగ కార్యక్రమంలో పాల్గొని మా అందరికీ ఆనందం కలిగించినందుకు సదా కృతజ్ఞతలతో
Post a Comment