10.1-1714 aa yelanaaga
10.1-1714-ఉ.
ఆ యెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా
యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; దప్పదు జాడ్యము లేల? నీవు నీ
తోయమువారుఁ గూడుకొని తోయరుహాననఁ దెత్రుగాని వి
చ్చేయుము; శత్రుల
న్నుఱుము జేయుము చేయుము శోభనం బిలన్.
10.1-1714-u.
aa
yelanaaga neeku@M dagu; naMganakuM dagu deevu maa yupaa
dhyaayula
yaana peMDli yagu@M; dappadu jaaDyamu laela?
neevu nee
tOyamuvaaru@M
gooDukoni tOyaruhaanana@M detrugaani vi
chchaeyumu; Satrula nnu~rumu jaeyumu chaeyumu SObhanaM bilan.
బ్రాహ్మణుడు
అగ్నిద్యోతనుడు కృష్ణునితో రుక్మిణి సందేశం చెప్పి ఆమెను చేపట్ట మని చెప్తున్నాడు.
పురోహితుడు కదా లోకహితాన్ని కూడ ఆకాంక్షిస్తున్నాడు – మా గురువుల మీద
ఒట్టు వేసి చెప్తున్నాను, నీవు రుక్మణి
ఒకరి కొకరు తగిన జోడి. మీకు వివాహం తప్పక జరుగుతుంది. ఇంకా ఆలస్యం వద్దు.
పద్మాక్షిని తెచ్చుకోడానికి నీవు నీ వాళ్ళతో కలిసి వెంటనే బయలుదేరు. రా. వైరులను
నుగ్గు నుగ్గు కావించు. లోకానికి మేలు చేకూర్చు.
ఆ = ఆ యొక్క; ఎలనాగ = యువతి {ఎలనాగ – లేత వయస్కురాలు, వనిత}; నీకున్ = నీకు; తగున్ = సరిపడును; అంగన = వనిత {అంగన - మంచి అంగములు కలామె, స్త్రీ}; కున్ = కు; తగుదువు = సరిపడుదువు; ఈవు = నీవు; మా = మా యొక్క; ఉపాధ్యాయుల = గురువుల మీద; ఆన = ఒట్టు; పెండ్లి = వివాహము; అగున్ = జరుగును; తప్పదు = తథ్య మిది; జాడ్యములు = ఆలశించుటలు; ఏలన్ = ఎందుకు; నీవున్ = నీవు; నీ = నీ యొక్క; తోయమువారు = తోటివారు; కూడుకొని = కలిసి; తోయరుహాననన్ = పద్మాక్షిని; తెత్రుగాని = తీసుకొద్దురుగాని; విచ్చేయుము = రమ్ము; శత్రులన్ = విరోధులను; నుఱుము = పొడిగా, మర్ధించుట; చేయుము = చేయుము; చేయుము = చేయుము; శోభనంబు = శుభములను; ఇలన్ = లోకమునకు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment