Saturday, October 26, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 97



vachcheda rade

10.1-1756-క.
చ్చెద రదె యదువీరులు
వ్రచ్చెద రరి సేన నెల్ల వైరులు పెలుచన్
నొచ్చెదరును విచ్చెదరును
చ్చెదరును నేడు చూడు లజాతాక్షీ!
10.1-1756-ka.
vachcheda rade yaduveerulu
vrachcheda rari saena nella vairulu peluchan
nochchedarunu vichchedarunu
jachchedarunu naeDu chooDu jalajaataakshee!
          రుక్మిణీ కల్యాణం ఘట్టంలోదిది. ప్రాస ద్విత్వాక్షరం చ్ఛెతో బాటు మరియు రకారం నాలుగు పాదాలలో ప్రయోగించిన యీ కందపద్యం నడక ఎంతో బావుంది. జరాసంధాదులు అడ్డుకుంటుంటే, తీసుకెళ్తున్న శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి ధైర్యం చెప్తున్నాడు – ఓ సరోజా ల్లాంటి కళ్ళున్న రుక్మిణీదేవి! చూస్తూ ఉండు ఇదిగో మన యాదవ వీరులు ముందుకు వచ్చి శత్రుమూకలను చీల్చి చెండాడుతారు; శత్రువులు యివేళ బాగా దెబ్బతింటారు; చెల్లా చెదురై, చస్తారు.
          వచ్చెదరు = ముందుకు వస్తున్నారు; అదె = అదిగో; యదు = యాదవ; వీరులు = సైనితులు; వ్రచ్చెదరు = భేదించెదరు; అరి = శత్రు; సేనన్ = సైన్యను; ఎల్లన్ = అంతటిని; వైరులున్ = శత్రువులను; పెలుచన్ = మిక్కుటముగ; నొచ్చెదరు = దెబ్బతింటారు; విచ్చెదరును = చెల్లాచెదురు ఔతారు; చచ్చెదరును = మరణిస్తారు; నేడు = ఇవాళ; జలజాతాక్షీ = పద్మాక్షీ, రుక్మిణి.


~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: